ప్రత్యేక అలంకరణ తో దేదీప్యమానంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి
ప్రత్యేక అలంకరణ తో దేదీప్యమానంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన మండలంలోని సింగరకొండలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం అమావాస్య సందర్భంగా దాతలు సహకారంతో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి అరటి పండ్ల పూజ అత్యంత వైభవోపేతంగా జరిగింది...
ప్రాతఃకాల సుప్రభాతం గోపూజ బిందెతీర్థం అనంతరం స్వామి వారికి అభిషేక కార్యక్రమం అలంకరణ తదుపరి వేదపండితులు అర్చకులు ఉభయ దాతలు వేదస్వస్తి మంగళ వాయిద్యములతో ఆలయ ప్రదక్షిణ వినాయక స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి జీవధ్వజ ఉష్ఠ్రవాహనానికి నారికేళఫల సమర్పణ తదుపరి గణపతి పూజ ఋత్విక్వరుణ అనంతరం 11 ఆవృత్తములుగా దేవస్థానం వేదపండితులు అర్చకులు పూజా కార్యక్రమము నిర్వహించారు.స్వామివారికి మహానివేదన పంచహారతులు కార్యక్రమం నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమానికి గుంటూరు పట్టణానికి చెందిన
శ్రీ న్యూ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ నిర్వాహకులు పొనకాల శ్రీనివాసరావు వారి బంధువులు,భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
పూజ అనంతరం దేవస్థానం వేదపండితుల అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0