మహా టీవీ కార్యాలయం దాడి పై కూటమి ఖండన ఇదేమి చోద్యం అంటున్న వైసీపీ సోషల్ మీడియా
మహా టీవీ కార్యాలయం దాడి పై కూటమి ఖండన ఇదేమి చోద్యం అంటున్న వైసీపీ సోషల్ మీడియా
ఫోన్ టాపింగ్ వ్యవహారంపై మహా టీవీలో వచ్చిన కథనాలని నిరసిస్తూ టిఆర్ఎస్ కార్యకర్తలు నేడు మహా టీవీ కార్యాలయం పై దాడి చేశారు..
కొంతమేర ఫర్నిచర్ ను సామాను ధ్వంసం చేశారు..
వెంటనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ , జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండిస్తూ ఏదైనా సదరు చానల్ ప్రసారం చేసిన వాటిలో అభ్యంతర కరమైన అంశాలు ఉంటే ఖండించాలి.. కానీ ఇలా దాడి చేయడం ఏంటని సామాజిక మాధ్యమాలలో తమ అఫీషియల్ పేజీలలో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు..
అయితే సాక్షిపై ఆర్గనైజ్డ్ దాడులను ప్రోత్సహించి కార్యాలయాలపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు చేయకపోవడం ఏమిటి అని వైసిపి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు..
అదేవిధంగా స్వయంగా డీజీపీ కార్యాలయానికి వెళ్లి సాక్షి ప్రతినిధులు కలిసిన ఇంతవరకు కార్యాలయం పై దాడులు చేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు..
ఇదేమి నీతి ఇదేమి రాజ్యం అని వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు వైసీపీ క్యాడర్..
ఇలాంటి ద్వంద్వ వైఖరి పనికి రాదని పత్రిక డిజిటల్ మాధ్యమాలు అన్నీ ఒకటే అనే విషయం గుర్తుంచుకోవాలని తమకు అనుకూలమైన మీడియా పట్ల ఒక రకంగా తమలోపాలని అవినీతిని అక్రమాలను ప్రశ్నించే మీడియాను మరో రకంగా చూడటం ఏమాత్రం భావ్యం కాదని సోషల్ మీడియాలో వైసిపి వర్గీయులతో పాటు పలువురు మేధావులు కూడా సూచిస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0