ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసిపి కి గుడ్ బై?
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసిపి కి గుడ్ బై?
వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ త్వరలోనే టిడిపి గూటికి చేరనున్నారా?
చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ నాయకుడు వైఎస్సార్ కుటుంబానికి విధేయుడు మర్రి రాజశేఖర్ త్వరలోనే టిడిపి పార్టీలో చేరనున్నట్లు సమాచారం..
2019 ఎన్నికలలో ఆర్థిక వనరుల రీత్యా రాజశేఖర్ చిలకలూరిపేట నుండి వైయస్ జగన్ ఇచ్చిన మాట మేరకు పోటీ చేయకుండా అభ్యర్థిగా నిలబడ్డ విడదల రజనికి మద్దతును ఇచ్చారు..
అయితే తర్వాత పరిణామ క్రమంలో రజనీకి రాజశేఖర్ కు పచ్చ గడ్డి వేస్తే బగ్గు మనే రీతిలో వివేదాలు తారాస్థాయికి చేరాయి..
ఈ నేపథ్యంలో విడదల..మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శలు వచ్చాయి..
అయితే చివరి రెండు సంవత్సరాలు ప్రభుత్వ పదవీకాలం ఉందనగా వైసీపీ అధినేత వైయస్ జగన్, రాజశేఖర్ కు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు..
ప్రస్తుతం ఎన్నికల అనంతరం తిరిగి విడదల రజనీకి చిలకలూరిపేట వైసిపి ఇన్చార్జిగా ఇవ్వడంతో ఇక తనకు పార్టీలో పెద్ద ప్రాధాన్యత ఉండదని ఆలోచనతో చిలకలూరిపేటలోని ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనాలని ఉద్దేశం తో టిడిపిలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం..
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విడదల రజనికి రాజశేఖర్‌తోపాటు లావు కృష్ణదేవరాయలతో సయోధ్య లేదు..
ఈ నేపథ్యంలో లావు కృష్ణదేవరాయలు..
మర్రి రాజశేఖర్ ను టిడిపిలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం..
లావు కృష్ణదేవరాయలు ఈ మేరకు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తో మంతనాలు జరిపి రాజశేఖర్ ను పార్టీలో చేర్చేందుకు లైన్ క్లియర్ చేసినట్లు బోగట్ట..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0