126 గ్రాముల బంగారం రెండు మోటార్ సైకిల్లు స్వాధీనం
126 గ్రాముల బంగారం రెండు మోటార్ సైకిల్లు స్వాధీనం
వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగలను మేదరమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.చీరాల డి.ఎస్.పి ఎస్డి మోయిన్ కథనం ప్రకారం, కొత్తపట్నం ఈతముక్కల గ్రామానికి చెందిన దర్శనాల ఏడుకొండలు 29, షేక్ రషీద్ 20 గత కొంతకాలంగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ ఇద్దరు స్నేహితులు కావడంతోపాటు ఒకే గ్రామానికి చెందిన వారై విలాసవంతమైన జీవితంతో బెట్టింగులు, చెడు వ్యసనాలకు బానిసలై వారి ఖర్చులకోసం వివిధ ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. కొరిసపాడు మండలం మేదరమెట్ల, తిమ్మనపాలెం గ్రామాలలో, ఒంగోలు పట్టణంలో, కొనకనమిట్ట మండలం చినమనగుండం గ్రామంలో మహిళలను మోటార్ సైకిల్ పై వెంబడిస్తూ వారి మెడలోని బంగారు గొలుసులను లాకెళ్ళారు. పై పేర్కొనబడిన ప్రదేశాలలో దాదాపు 126 గ్రాముల బంగారపు గొలుసులను, మేదరమెట్లలో యమహా మోటార్ సైకిల్ ను దొంగిలించారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి నేతృత్వంలో అద్దంకి రూరల్ సీఐ టీ మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ, కొరిసపాడు ఎస్ఐ వై సురేష్, పంగులూరు ఎస్సై వినోద్ బాబు వీరి కోసం గాలిస్తూ ఉండగా అందిన సమాచారం మేరకు మేదరమెట్ల వై జంక్షన్ వద్ద వీరిని అరెస్ట్ చేసి గ న్యాయస్థానం లో హాజరు పరిచారు. తక్కువ సమయం లో కేసును చేదించినందుకు ఎస్పీ పోలీస్ అధికారులను అభినందించినట్లు డి.ఎస్.పి వివరించారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0