జ్యూరిచ్ లో జరిగిన తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే మంత్రి టీ జే భరత్ సంచలన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో కాబోయే సీఎం నారా లోకేష్..
జ్యూరిచ్ లో జరిగిన తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే మంత్రి టీ జే భరత్ సంచలన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో కాబోయే సీఎం నారా లోకేష్..
గత రెండు రోజులు నుండి నారా లోకేష్ డిప్యూటీ సీఎం గా పదవి చేపట్టే అవకాశం ఉందని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పాటు తెలుగుదేశం కీలక నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
పిఠాపురం వర్మ.. కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి పథకం ప్రకారం నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉన్నారు..
దానికి ప్రతిగా జన సైనికులు డిప్యూటీ సీఎం నారా లోకేష్ చేస్తే అభ్యంతరం లేదు కానీ పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని తమ గొంతుకలను వినిపిస్తున్నారు..
జన సేనాని పవన్ కళ్యాణ్ సైతం బిజెపి పెద్దలకు టిడిపి నాయకుల ప్రకటనల విషయమై ఫిర్యాదు చేయడంతో వారు జోక్యం చేసుకొని ఏదైనా కూటమి సమిష్టి నిర్ణయం జరగాలి తప్పితే ఎవరికి వారు భాష్యాలు చెప్పడం తగదని చంద్రబాబుకు సూచించిన నేపథ్యంలో కొన్ని గంటల క్రితం అధిష్టానం నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడం వంటి ప్రకటనలు ఇక చేయరాదని టిడిపి క్యాడర్ కు నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది..
అయితే ఇంతలోనే దావోస్ పర్యటన సందర్భంగా తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టీజే భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
స్వయానా చంద్రబాబు.. నారా లోకేష్ సమక్షంలోనే భవిష్యత్తులో నారా లోకేష్ కాబోయే సీఎం గా అభివర్ణించారు..
మరింత ముందడుగు వేసి ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు లలో నారా లోకేష్ లాగా స్టాండ్ ఫర్ యూనివర్సిటీలో చదివిన విద్యావేత్తలు లేరని అభివర్ణించారు..
ఒకపక్క కూటమి సమిష్టి నిర్ణయాల ప్రకారమే జరగాలని అంటూనే మరల ఇంతలోనే ఇలాంటి వ్యాఖ్యలు భరత్ లాంటి వారు చేయడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0