అరటిపండ్ల ప్రత్యేక అలంకరణలో అమావాస్య రోజున శోభయమానంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి
అరటిపండ్ల ప్రత్యేక అలంకరణలో అమావాస్య రోజున శోభయమానంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన సింగరకొండ క్షేత్రములో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఆది వారం అమావాస్య సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కి ఆలయ పూజారులు దాతల సహకారంతో అరటి పండ్ల పూజ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ప్రాతఃకాల సుప్రభాతం గోపూజ బిందెతీర్థం అనంతరం స్వామి వారికి అభిషేక కార్యక్రమం అలంకరణ తదుపరి వేదపండితులు అర్చకులు ఉభయ దాతలు వేదస్వస్తి మంగళవాయిద్యములతో ఆలయ ప్రదక్షిణ వినాయక స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి జీవధ్వజ ఉష్ఠ్రవాహనానికి నారికేళఫల సమర్పణ తదుపరి గణపతి పూజ ఋత్విక్వరుణ అనంతరం 11 ఆవృత్తములుగా దేవస్థానం వేదపండితులు అర్చకులు లక్ష తమలపాకుల తో పూజా కార్యక్రమము నిర్వహించారు స్వామివారికి మహానివేదన పంచహారతులు కార్యక్రమం నిర్వహించారు.ఈ అరటి పండ్ల పూజా కార్యక్రమంలో ఉభయదాతలు గుంటూరు పట్టణానికి చెందిన
శ్రీ న్యూ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ నిర్వాహకులు తరుపున దేవాలయ సహాయ కమీషనర్ కార్యనిర్వాహణా ధికారి టి సుభద్ర పూజలు నిర్వహించినారు,
పూజ అనంతరం దేవస్థానం వేదపండితుల అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0