వల్లభనేని వంశీయే గన్నవరం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్.. భవిష్యత్తులో పోటీ చేసేది ఆయనే గెలిచేది ఆయనే
వల్లభనేని వంశీయే గన్నవరం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్.. భవిష్యత్తులో పోటీ చేసేది ఆయనే గెలిచేది ఆయనే
వల్లభనేని వంశీయే గన్నవరం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్.. భవిష్యత్తులో పోటీ చేసేది ఆయనే గెలిచేది ఆయనే... మాజీ మంత్రి పేర్ని నాని స్పష్ఠీకరణ..
ఈ మేరకు ఆయన గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు..దాదాపు 112 రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న ఆయన అనారోగ్య పరిస్థితులను లెక్కచేయకుండా ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని విమర్శించారు..
డాక్టర్ల చేత తప్పుడు రిపోర్టులు ఇప్పిస్తూ వంశీ ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారం కోర్టులకు అందించిందని ఆయన విమర్శించారు..
వంశీ భార్య పంకజశ్రీ వంశీకి అండగా ఆయన ఆరోగ్యం పూర్తిగా చక్కబడిందాకా తోడుగా ఉండవలసిన అవసరం ఆమెకు ఉందని స్పష్టం చేశారు.. వంశీయే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు భవిష్యత్తులో గన్నవరం కు కాబోయే ఎమ్మెల్యే అని ఉద్ఘాటించారు..
నారా లోకేష్ రెడ్ బుక్కు పై కీలక వ్యాఖ్యలు చేశారు నాని..
ఆయన రెడ్ బుక్కును మడిచి పెట్టుకోవలసిన సమయం ఆసన్నమైందని,ఇలాంటి ఊడుతా ఊపులకు వైసీపీ కార్యకర్తలు భయపడేది లేదని స్పష్టం చేస్తూ గన్నవరం నియోజకవర్గంలోనే ఒక అక్రమ కేసులో ఒక కార్యకర్తను ఇరికిస్తే ఆయన తండ్రి మరణిస్తే తండ్రి దినానికి కూడా బెయిల్ రాకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని విశితంగా విమర్శించారు..
అయితే సదరు కార్యకర్త తన తండ్రి దినాన్ని తనకు బెయిల్ వచ్చేదాకా వాయిదా వేసుకుని సదరు కార్యక్రమాలు పూర్తిచేసి మరల వైసీపీ జెండా పట్టుకొని నేడు తిరుగుతున్నాడని.. ఇలాంటి కేసులకు వైసీపీ కార్యకర్తలు భయపడేది లేదని స్పష్టం చేశారు...
వంశీ ఆరోగ్యం కుదుటపడి జనజీవన స్రవంతిలోకి రావడానికి కొంత సమయం పడుతుందని ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండి పార్టీ పిలుపుమేరకు జూన్ 4 వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయాలని అన్ని విధాల వైసీపీ పార్టీ అధినేత జగన్ కార్యకర్తలకు అండగా ఉంటారని పేర్ని నాని స్పష్టం చేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0