లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోతుంది
లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోతుంది
విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరామర్శించారు..
ఈ సందర్భంగా పరామర్శ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో పూర్తిగా క్షీణించింద ని తీవ్రంగా విమర్శించారు..
కేవలం తప్పుడు కేసులు బనాయించి వంశీని జైలు పాలు చేయడానికి ప్రయత్నించటం అత్యంత హేయమని అన్నారు..
2023లో వల్లభనేని వంశీ తదితరులను పట్టాభి విజయవాడలోను..గన్నవరంలోను తానే స్వయంగా వెళ్లి రెచ్చగొట్టి ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యాడని అన్నారు.. 2023లో గన్నవరంలో తెలుగుదేశం దాడిలో సీఐ కనకారావు గాయపడ్డారని తెలిపారు... ఇంత జరిగిన వైసీపీ ప్రభుత్వంలో ఇరువర్గాల మీద కేసులు నమోదు చేశామని కానీ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన పేరు ఫిర్యాదులో లేకపోయినా చేర్చి సత్య వర్ధన్ మీద వారి కుటుంబం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి మరలా ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడుతున్నారని స్పష్టం చేశారు..
తన సొంత సామాజిక వర్గంలో ఎవరైనా స్వతంత్రంగా ఎదుగుతూ ఉంటే చంద్రబాబు ఓర్వ లేరని ఇలాంటి నీచ చర్యలకు పాల్పడతారని తీవ్రంగా విమర్శించారు..
అంతే కాదు ఇటీవల మునిసిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలలో ఒక కౌన్సిలర్ లేకపోయినా తిరుపతి పిడుగురాళ్ల పాలకొండ వైస్ చైర్మన్ పదవులు కైవసం చేసుకునేందుకు వారు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరమని స్పష్టం చేశారు..
తునిలో గెలిచేందుకు అవకాశం లేదు కనుక ప్రలోభాలకు లొంగకుండా కౌన్సిలర్లు నిలబడ్డారని అంశంతో వైస్ చైర్మన్ ఎన్నిక జరక్కుండా అడ్డుపడుతున్నారు అని విమర్శించారు...
ఇక పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అని వారిని సప్త సముద్రాల అవతల ఉన్న రిటైరైన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాక్కొని తీసుకొస్తామని తీవ్రంగా హెచ్చరించారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0