తెలుగుదేశం శ్రేణులలో ఆగ్రహవేశాలకు నాంది పలికిన మొదటి లిస్టు ప్రకటన
తెలుగుదేశం శ్రేణులలో ఆగ్రహవేశాలకు నాంది పలికిన మొదటి లిస్టు ప్రకటన
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 మంది అభ్యర్థులలో సీనియర్లకు చోటు దక్కలేదు...
వారిలో దేవినేని ఉమ.. యరపతినేని శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బి.కె పార్థసారథి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు,మండలి బుద్ధ ప్రసాద్ లకు చోటు లభించలేదు...
వైసిపి నుండి వలస వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి..ఉండవల్లి శ్రీదేవి...మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ప్రస్తావన లేదు...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం నెల్లూరు రూరల్ కేటాయించారు..
కళ్యాణదుర్గం టికెట్ ఆశించిన ప్రభాకర చౌదరికి మొండి చెయ్యే దక్కింది...
దాంతో ఆయన వర్గం చంద్రబాబు ఫ్లెక్సీలను చింపి వేస్తూ.. డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసింది..
తెనాలి ఆలపాటి రాజా వర్గం కూడా జనసేన నాదెండ్ల మనోహర్ కి సీట్ కేటాయింపు పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది...
ఉండి తెలుగుదేశం నేత వేటుకూరి వెంకట శివరామరాజు... గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఆలపాటి రాజా కూడా అదే బాటలో నడవనన్నాడనేది సమాచారం... తుని నియోజకవర్గ నుండి యనమల కృష్ణుడు... భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా రాజీనామాలకు సిద్ధమైనట్లు సమాచారం...
ప్రస్తుతానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా దాదాపుగా జనసేన రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఖాయం అయినట్టు సమాచారం...
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ప్రకటించకపోవడం వెనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం లో చేరితే ఆయన సతీమణి ప్రశాంతికి ఆ నియోజకవర్గ టికెట్ కేటాయిస్తారని సమాచారం...
ఒంగోలు లో మహానాడులో తొడగొట్టిన ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కు మొండి చెయ్యి...
దేవినేని ఉమ మైలవరం ఆశిస్తున్నా... వసంత కృష్ణ ప్రసాద్ చేరనున్నాడనే సమాచారం మేరకు మైలవరం ఎవరినేది టిడిపి అధిష్టానం తేల్చలేదు...
అదేవిధంగా గురజాల వైసీపీ నుండి వలస వచ్చిన జంగా కృష్ణమూర్తి కి కేటాయిస్తారు అనేది సమాచారం..
వైసిపి ప్రాధాన్యత ఇచ్చినా అలకబూని కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు రత్నాకర్లకు కూడా మొండి చేయి...
బాగా వివాదం నెలకొన్న స్థానాలు ప్రకటించకుండా ఆయా స్థానాలలో ప్రస్తుతం పని చేస్తున్న వారిని బుజ్జగించి ఫైనల్ లిస్ట్ వెలువరించే అవకాశం ఉన్నది అనేది సమాచారం...
కేవలం 24 సీట్లకే పొత్తు భాగస్వామ్యం కుదుర్చుకున్న జనసేన అయితే తను పోటీ చేసే సీటుతో సహా ఇంకా 21 స్థానాలకు పేర్లు ప్రకటించని జనసేనాని పవన్ కళ్యాణ్...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0