అమరావతిలో నే పేద ప్రజలట రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ధనిక ప్రజలట ఇదెక్కడి న్యాయం
అమరావతిలో నే పేద ప్రజలట రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ధనిక ప్రజలట ఇదెక్కడి న్యాయం
ఫిబ్రవరి 1 నుండి ఆంధ్రప్రదేశ్ లో భూములు స్థలాల రిజిస్ట్రేషన్ వేల్యూలు పెరగనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ వెల్లడించారు..
అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల లో మాత్రం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగవని తెలిపారు..
ఆ గ్రామాలలో పేద ప్రజలు నివసిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు..
రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాలలో కొన్నిచోట్ల తగ్గింపులు మిగిలిన చోట్ల పెంపుదల ఉంటుందని స్పష్టం చేశారు..
మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి పాడుతున్న పాటనే మంత్రి మరల పాడారు..
గత ప్రభుత్వం రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన చేసిందని వాటిని వరుసగా క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు..
రిసర్వేలు గత ప్రభుత్వం సరిగా చేయలేదని మరల ఈ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఉద్ఘాటించారు..
గతంలో జగన్ ప్రభుత్వం పై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ప్రచురణ కావడాన్ని ప్రజలలోకి పెద్ద అస్త్రంగా తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టుకున్న టిడిపి మరలా రీ సర్వే నిర్వహిస్తానని చెప్పడం హాస్యాస్పదమని వైసిపి శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి..
అప్పుడు జరిగింది ఆ యాక్ట్ పేరు తో రీసర్వేనే అని కాకపోతే పాస్ పుస్తకాలపై రిసర్వే సందర్భంగా హద్దురాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ ఉండటం వైసీపీ పార్టీకి ఓట్లను దూరం చేసిందని ఆ క్యాడర్ అంగీకరిస్తూనే ఉంది..
అయితే మసి పూసి మారేడు కాయ చేస్తూ అదే విధానాన్ని కొనసాగించడం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి చెల్లిందని విమర్శలు వినవస్తున్నాయి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0