హద్దులు మీరుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం..ఏం చేసినా మాదే న్యాయం అంటున్న పోలీసులు
హద్దులు మీరుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం..ఏం చేసినా మాదే న్యాయం అంటున్న పోలీసులు
నీవు చూపిన బాట యే నీరజాక్ష అంటూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అరాచకం రాష్ట్రంలో రాజ్యమేలతోతుంది..
ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులకు ఇచ్చిన స్వేచ్ఛ లో భాగంగా వారు ఏది చేసినా తాము చెప్పినదే వేదమంటున్నారు..
మొన్నటికి మొన్న నడిరోడ్డులో ముగ్గురు యువకులను దారుణంగా కొట్టి హింసించిన పోలీసులు తాజాగా కొండేపి నియోజకవర్గం జాళ్ళ పాలెం లో ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర విస్మయానికి గురిచేస్తుంది.
జాల్లపాలెంలో ఒక కిరాణా కొట్టు నిర్వహిస్తున్న వారి ఇంటిలోకి వెళ్లిన పోలీసులు ఒక మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు..
సదరు కిరాణా కొట్టుకి పక్కనే ఉన్న ఇంట్లో దొంగతనం జరగటంతో సీసీటీవీ ఫుటేజ్ కోసం పక్కనే ఉన్న ఈ కిరాణా కొట్టు నిర్వహిస్తున్న వారి ఇంట్లోకి వెళ్లిన సందర్భంలో కిరాణా కొట్టు యజమాని లేరని మీరు ఆయన వచ్చిన తరువాత రాండని చెబుతున్న వినిపించుకోకుండా స్వయానా ఎస్ఐ ఆమెని తోసివేసి ఇంటిపై భాగంలో ఉన్న సీసీటీవీ కి సంబంధించిన పరికరాలను తీసుకువెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
యధా రాజా తథాప్రజ అన్న రీతిన ప్రస్తుతం తెలుగుదేశం పాలకులు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తలకు ఎక్కించుకున్న పోలీసులు వివిధ అక్రమ కేసులలోచురుకైన పాత్ర పోషించడంతోపాటు నిబంధనలను చట్టాన్ని తుంగలోకి తొక్కి అమానుష చర్యలకు పాల్పడటం విస్తూపోయే విషయమే అంటున్నారు ప్రజలు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0