ప్రజల దీవెనలతో నాయకుల కార్యకర్తల సహకారంతో నాదే విజయం
ప్రజల దీవెనలతో నాయకుల కార్యకర్తల సహకారంతో నాదే విజయం
ప్రజలకు మంచి పాలన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అందించారని.. ప్రజల దీవెనలతో ప్రత్యర్థి ఎవరైనా తన విజయం తథ్యం అని వైసిపి పిఠాపురం అభ్యర్థి వంగా గీత తెలిపారు...
పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని విలేకరులతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని తనకు పిఠాపురం కొత్త కాదని పిఠాపురం ఆడబడుచునని వంగా గీత తెలిపారు..
దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుండి గడపగడపకి కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వం చేరువైందని ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ నేరుగా చేరుతున్నాయని తెలిపారు..
పిఠాపురం నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతానని అన్నారు...
పిఠాపురం అభివృద్ధికి అవసరమైన వనరులు ఉన్నాయని..సెజ్ ఏరియా ఉందని.. కోస్టల్ క్యారిడార్..అన్ని నేషనల్ హైవే లను ఆనుకుని ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు...
దేశంలోనే తలమానికమైన చేనేత నైపుణ్యం పిఠాపురం చేనేత కార్మికులదని.. మత్స్యకారులు.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులు... ఓసీలు అన్ని వర్గాల ప్రజలు తనను నియోజకవర్గంలో ఆదరిస్తున్నారని తెలిపారు...
నాయకులు కార్యకర్తలు సహకారంతో పిఠాపురం ప్రజల సంపూర్ణ మద్దతుతో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు వంగా గీత...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0