అణగారిన కులాల గొంతుక మహాకవి కుసుమధర్మన్న
అణగారిన కులాల గొంతుక మహాకవి కుసుమధర్మన్న
కళామిత్రమండలి(తెలుగు లోగిలి)జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు అణగారిన కులాల గొంతుకైన కుసుమ ధర్మన్న జీవితం పై మహాకవి ధర్మన్న 125వ జయంతి ఉత్సవాలు సందర్భంగా పత్ర సమర్పణ చేసి ప్రసంగించారు...
ఈసదస్సు తొలి తెలుగు దళిత కవితా వైతాళికుడు,మహాకవి కుసుమ ధర్మన్న 125 వ జయంతోత్సవాల సందర్భంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మరియు కుసుమ ధర్మన్న కళాపీఠం సంయుక్త నిర్వహణలో రాజమహేంద్రవరం "ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం" సెమినార్ హాల్లో నిర్వహించారు.
ఈజాతీయ సెమినార్ లో చాలా మంది అధ్యాపకులు పాల్గొని పత్ర సమర్పణ చేశారు..
ఈసదస్సుకు నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు ముఖ్య అతిథిగా,విశిష్ట అతిథులుగా రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య పి.వరప్రసాద్ మూర్తి, మద్రాసు యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు , ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయ ఆచార్య డా బూసి వెంకటస్వామి మరియు సభాధ్యక్షులు ఆచార్య డి. జ్యోతిర్మయిలు, ర్యాలీ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ నూనె అంకమ్మరావు తో పాటు కవులు,రచయితలందర్ని కార్యక్రమ నిర్వాహకులు సత్కరించారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0