ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల భక్తిలో భాగంగా వై వి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల భక్తిలో భాగంగా వై వి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు
ఎట్టకేలకు వైవి సుబ్బారెడ్డి తన మనోవాంఛను కొద్దిరోజుల్లోనే నెరవేర్చుకోనున్నారు.. వై వి సుబ్బారెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుండి పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు..
వైయస్ మరణాంతరం జగన్ వెంట ఉండి కష్ట సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు.. 2014 ఎన్నికలలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయనకు ఎంపీ టికెట్ లభించలేదు.. ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.. తనకు టికెట్ దక్కని నేపథ్యం లో కొద్ది రోజులు కినుక వహించిన తరువాత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు పార్టీలో కీలక బాధ్యతలు వైవి సుబ్బారెడ్డి చూశారు..
టీటీడీ చైర్మన్గా రెండుసార్లు సీఎం జగన్ బాబాయి సుబ్బారెడ్డి కి అవకాశమిచ్చారు.. అయితే ఎంపీగా వెళ్లాలనే ఆయన అభిలాష ను గమనించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో త్వరలోనే సుబ్బారెడ్డి పార్లమెంట్ గడప తొక్కనున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0