ఎలాంటి పదవులు ఆశించి చేరడం లేదు వైసిపి పార్టీ కోసం ఎన్నికలలో ప్రచారం చేస్తా
ఎలాంటి పదవులు ఆశించి చేరడం లేదు వైసిపి పార్టీ కోసం ఎన్నికలలో ప్రచారం చేస్తా
తిరిగి తాను రాజకీయ అరంగ్రేటంచేయనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు...
ఈనెల 14న సాయంత్రం నాలుగు ఆరు గంటల మధ్య సీఎం సమక్షంలో తాడేపల్లిలో వైసీపీ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు..
తనకు ఎలాంటి పదవీ కాంక్షలు లేదని తెలిపారు తాను ఎమ్మెల్యే సీటు గాని ఎంపీ సీటు గాని ఆశించడం లేదు అన్నారు...
అనేక సంక్షేమ పథకాలు చేసి సీఎం జగన్ ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారు..
మరింత సంక్షేమం అభివృద్ధితో ఆయన ముందుకు సాగాలని కోరుకుంటున్న...
వైసీపీ పార్టీ కోసం రానున్న ఎన్నికల్లో ప్రచారం చేస్తా...
తనతో పాటు తన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరినట్లు ఆయన తెలిపారు..
భగవంతుని దయవల్ల తిరిగి సీఎం జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా...
తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఏ పదవి ఇస్తే అది స్వీకరిస్తానని తెలిపారు ముద్రగడ...
ముద్రగడ ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీలో చేరడు అని కొందరు జనసేన నాయకులు భావించారు...
బిజెపిలో చేరతాడు కాపులు రాజ్యాధికారం పంచుకోవడమే ఆయన లక్ష్యం అని చెప్పుకొచ్చారు...
జనవరి నెలలో వైసీపీకి నాకు కుదరదు అంటూ జనసేన వైపు మొగ్గు చూపిన అటు నుంచి పవన్ కళ్యాణ్ వచ్చి కలుస్తాడు అనుకున్నప్పటికీ కలవకపోవడంతో ఇక తన అవసరం జనసేనకు లేకపోవచ్చు ఏమో అంటూ పవన్ కి ఉత్తరం రాసి తెలియజేశారు ముద్రగడ..
మిమ్మల్ని ఏదైనా శక్తి ఆపుతుందేమోనని పరోక్షంగా చంద్రబాబునాయుడు కి కూడా చురకలు అంటించారు..
ఈ నేపథ్యంలో వైసిపి వాళ్లు మిథున్ రెడ్డి నాయకత్వంలో వచ్చి కలవడం ముద్రగడ వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం చకచకా జరిగిపోయాయి...
ముఖ్యంగా ముద్రగడ తన కుమారుడు భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఉండవచ్చు...
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరల తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకోవడం తన కుమారుడి కోసమే కావచ్చు...
అవినీతి మరకలు లేని ముద్రగడ కాపు నాయకుడిగా గుర్తింపు పొందారు...
మరి అలాంటి నాయకుడిని వదులుకోవడం మంచిది కాదు అని పవన్ కళ్యాణ్ కి మరి వీర జనసైనికులు చెప్పలేకపోతున్నారు..
ఆయన కలిసి పని చేద్దాం అన్న కోరికను జనసేన పార్టీ నెరవేర్చలేకపోయిన తరుణంలో మరి ఆయన తన కుమారుడి భవిష్యత్ కోసం తను వేరే మార్గం వెతుక్కోవాలి అనే ఆలోచన ఉండడం సహజం..
ఇందులో తప్పు పట్టవలసిన ఆగత్యం ఏమీ లేదు జనసేన అధినేత...వారి పార్టీ క్యాడర్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0