ఎన్ని మంది ఎన్ని కుట్రలు చేసినా ఆయన స్లోగన్ మాత్రం ఒకటే...చేసిన మంచే గెలిపిస్తుంది... ప్రజలే నా సైనికులు...స్టార్ క్యాంపెనర్లు
ఎన్ని మంది ఎన్ని కుట్రలు చేసినా ఆయన స్లోగన్ మాత్రం ఒకటే...చేసిన మంచే గెలిపిస్తుంది... ప్రజలే నా సైనికులు...స్టార్ క్యాంపెనర్లు
ఇప్పటికే సిద్ధం సభలతో దూకుడుగా ఉన్న జగన్ మరింత స్పీడు పెంచనున్నారు..
ఈనెల 16 నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించి నెల రోజులపాటు వివిధ ప్రాంతాలలో రాష్ట్రంలో సభలు... రోడ్ షోలు నిర్వహించనున్నారు...
ఎవరెన్ని ఎత్తులు వేసిన కుట్రలు చేసిన పొత్తులు కలిసిన జగన్మోహనుడిది ఒకటే స్లోగన్...
మీ బిడ్డ మంచి చేశాడు అనుకుంటే మీ బిడ్డను మరల గెలిపించండి.. డి బి టి విధానం ద్వారా ఎలాంటి వివక్షతకు అవకతవకలకు ఆస్కారం లేకుండా వివిధ పథకాల ద్వారా జీవన ప్రమాణాలు పెంచుతున్నాం.. మీరే రథసారథులు...మీ బిడ్డకు మీరే సైనికులు... మీరే స్టార్ట్ క్యాంపెనర్లు....
ఈ స్లోగన్ ఇప్పటికే పేద ప్రజల గుండెల్లో నాటుకు పోయింది... కరోనా రెండు సంవత్సరాల కష్ట కాలంలో రాష్ట్ర ఆదాయం గండిపడి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నవరత్నాలు ఆగలేదు తద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఉపాధి లేని సమయంలో ఆదుకోబడ్డారు...
నాడు నేడు ద్వారా విద్య వైద్యం రంగాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి.. విద్యాలయాల, వైద్యశాల రూపురేఖలు మారాయి...
విలేజ్ క్లినిక్ వచ్చాయి...ఆరోగ్య సురక్ష క్యాంపులు ప్రజలకు ఎంతో మేలు చేశాయి.. విద్యారంగంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు పూర్తిస్థాయి రియంబర్స్మెంట్ జగన్ ప్రభుత్వం తెచ్చింది..స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాలు ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తుంది.. మెరుగైన పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందుతుంది..డిజిటల్ విద్యాబోధన జరుగుతుంది.. టాయిలెట్స్ ఏర్పరచి ముఖ్యంగా మహిళ విద్యార్థుల కు ఉన్న ప్రధాన సమస్య తీర్చింది జగన్ ప్రభుత్వం...
ఇక సచివాలయ వ్యవస్థ ఆయా గ్రామాలలోని ప్రజలకు ఏ సర్టిఫికెట్ పొందాలి అన్న నేడు సో ఈజీ అవుతుంది... వాలంటీర్లు పెన్షన్ ఒకటవ తారీకు ఇంటింటికి వెళ్లి అందించడంతోపాటు ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర వహిస్తున్నారు...రైతు భరోసా కేంద్రాలు రైతులకు మేలు చేస్తున్నాయి..
31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతున్న ఇళ్ల నిర్మాణం...
ఆరోగ్య శ్రీ పథకం 25 లక్షలకు పెంపు...
రాష్ట్రంలో శ్రీ సిటీలో అనేక కొత్త పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి... వైజాగ్ లో ఐటి కంపెనీలకు తోడు కడపలో సెంచూరియన్ ఫైబర్ ప్లాస్టిక్ పరిశ్రమ వంటివి వచ్చాయి..
రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మచిలీపట్నం రామాయపట్నం వంటి పోర్టుల నిర్మాణం త్వరితగతిన జరుగుతుంది...ఇన్ని విధాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే...
చంద్రబాబు నాయుడు ఫస్టేషన్ పీక్స్ కి చేరింది...
నిత్యం సైకో జగన్ అని విమర్శిస్తూ ప్రజలకు సంబంధం లేని వివేక మర్డర్ కేస్ తోపాటు తల్లి చెల్లికి అన్యాయం చేసిన జగన్ అని జగన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి... తాను సీఎం జగన్ చేసిన కార్యక్రమాల కంటే మెరుగైన కార్యక్రమాలు ఏమి చేస్తాను అనేది చెప్పలేకపోతున్నారు...
జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలైన పథకాల కాపీ మేనిఫెస్టో అమలు చేస్తాను అని నమ్మబలకటం...
ప్రభుత్వ ఉద్యోగుల సిసిఎస్ విధానం పట్ల టిడిపి వైఖరి ఏంటో స్పష్టం చేయటం లేదు..
మందుబాబులకు బ్రాండెడ్ లిక్కర్ ని అందిస్తానని చెబుతూ మద్యం పాలసీ పై తన స్పష్టమైన వైఖరి చెప్పలేకపోతున్నాడు...
బేలగా ఎట్టకేలకు బిజెపి జనసేన తో కలిసి ఎన్నికల సమరంలోకి దిగబోతున్నాడు...
విప్లవాత్మకమైన పథకాలు సీఎం జగన్ తెచ్చిన మాట వాస్తవం...దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు..
కానీ ఆ పథకాలు జనాదరణ పుష్కలంగా పొందాయి అనేది అక్షర సత్యం..
అందుకే జగన్ కి జాతీయస్థాయిలో పేరొందిన అనేక వార్తా సంస్థలు తాము చేసిన సర్వేలలో మెజారిటీతో అగ్ర తాంబూలం ఇస్తున్నాయి...
ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుంది అని స్పష్టం చేస్తున్నాయి..
సిద్ధం నినాదం కూడా ప్రజల్లో చొచ్చుకుపోయి క్యాడర్లో మంచి జోష్ నింపుతుంది
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0