తనను దుర్మార్గుడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కరణం బలరాం కౌంటర్
తనను దుర్మార్గుడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కరణం బలరాం కౌంటర్
చంద్రబాబు నాయుడు తనను దుర్మార్గుడు అని దూషించడంపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం స్పందించారు..
అసంబద్ధ వ్యాఖ్యలు చేసే ముందు నువ్వేంటో నిన్ను నువ్వు తెలుసుకోవాలి అన్నారు కరణం బలరాం.. నువ్వు ఎంత దుర్మార్గుడివో నాకు ప్రత్యక్షంగా తెలుసునని అన్నారు...
చీరాల వెళ్తానని తాను కోరలేదని తనను బలవంతంగా చంద్రబాబు నాయుడు చీరాల పంపారని అయితే చీరాల ప్రజలు తనని ఆదరించి గెలిపించారని అన్నారు...
పార్టీలతో సంబంధం లేకుండా తాను చీరాలలో గెలిచానని మరి చీరాల తనను పంపి గెలిపించానని చంద్రబాబు నాయుడు చెప్పటం హాస్యాస్పదం అన్నారు..తన సొంత కుమారుడిని మంగళగిరిలో గెలిపించుకోలేని చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు అన్నారు..
23 మంది ఎమ్మెల్యేలను వైసీపీలో నుండి టిడిపిలోకి తీసుకోవడం పట్ల నాతోపాటు చాలామంది వ్యతిరేకించామని ఆయిన చంద్రబాబు వినలేదని అన్నారు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేస్తుండడం పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు కరణం...
ప్రస్తుతం సిట్టింగ్ నియోజకవర్గంలలో పనికిరాని చెత్త మరో నియోజకవర్గంలో పనికి వస్తుందా అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించటం ఆయన దగుల్బాజీతనాన్ని సూచిస్తుంది అన్నారు... మరి వైసీపీ అధిష్టానం వద్దని వదిలేసిన వ్యక్తులను చంద్రబాబు చేర్చుకోవడమేంటని మరి వారు టిడిపిలో పునీతులు అవుతారా అని సూటిగా ప్రశ్నించారు కరణం
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0