రాప్తాడు సిద్ధం సభకు ఉప్పొంగిన జన ప్రవాహం
రాప్తాడు సిద్ధం సభకు ఉప్పొంగిన జన ప్రవాహం
రాయలసీమ గడ్డకు రాయలసీమ బిడ్డగా మీ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నాడు అని జన సందోహం కరతాల ధ్వనుల మధ్య ముఖ్యమంత్రి జగన్ ఉపన్యాసం ప్రారంభించారు..
రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకొనే ఎన్నిక కాదు, ఐదేళ్లకాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధికి...డ్రామాలు ఆడే చంద్రబాబు కి మధ్య జరుగుతున్న యుద్ధం...
అందుకు మీరు జగన్ కి తోడుగా మీరు సిద్ధమా అని ప్రశ్నించారు
పేదవారి తరఫున నిలబడి వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న పేదల ప్రభుత్వం అయిన మనకు, పెత్తందారీ వ్యవస్థ కు వత్తాసు పలుకుతున్న చంద్రబాబు కి జరుగుతున్న యుద్ధం అన్నారు ముఖ్యమంత్రి...
14 సంవత్సరాలు సీఎం గా పాలించిన, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తు వచ్చే ఒక్క పథకమైనా ఉందా ఉందా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి...
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పరిపాలన మరింత సౌలభ్యంగా ఉండేటట్లు చేసాం
నాడు నేడు క్రింద పాఠశాలల స్థితిగతులను మార్చి విప్లవాత్మక మార్పులు తెచ్చాం..
అవ్వాతాతల కు నేరుగా ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్ అందిస్తున్నాం...
ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసాం...
విద్యార్థులకు డిజిటల్ విధానాల్లో మెరుగైన విద్యను అందించడంతోపాటు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా పలు సౌకర్యాలు కల్పించాం...యూనిఫాం స్కూల్ బ్యాగ్ ఉచితంగా పుస్తకాలు విద్యార్థులకు అందిస్తున్నాం..
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఉపయోగం చేస్తున్నాం...
మీ సంక్షేమ అభివృద్ధి కృషి చేస్తున్న మీ జగన్కు మీరే స్టార్ క్యాంపయినర్లు..
మీ జగన్ని మీరే దుష్ప్రచారం నమ్మకుండా గెలిపించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు జగన్...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0