వాలంటీర్ల పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నోటీసులు జారీ చేసిన గుంటూరు నాలుగవ అదనపు మేజిస్ట్రేట్ కోర్ట్
వాలంటీర్ల పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నోటీసులు జారీ చేసిన గుంటూరు నాలుగవ అదనపు మేజిస్ట్రేట్ కోర్ట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది...
గత సంవత్సరం జూలై 9న పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సంఘవిద్రోహశక్తులకు వాలంటీర్లు అందిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్నే లేపాయి...
రాష్ట్రంలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు...
రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయడంతో పాటు వాలంటీర్ల నైతికతను దెబ్బతీస్తూ వారిని విధి నిర్వహణకు ఆటంకంగా పరిణమిస్తాయని గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది...
అయితే గుంటూరు జిల్లా కోర్టు నాలుగవ అదనపు మెజిస్ట్రేట్‌కు ఈ కేసును బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది...
కేసు విచారణకు ఈనెల 25న పవన్ కళ్యాణ్ రావలసిందిగా కోర్టు నోటీసులు జారీ చేసింది
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0