అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి...హనిమిరెడ్డి పోటాపోటీ ప్రచారం
అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి...హనిమిరెడ్డి పోటాపోటీ ప్రచారం
అద్దంకి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు టిడిపి గొట్టిపాటి రవికుమార్.. వైసీపీ పానెం హనిమిరెడ్డి పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు...
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండల వాస్తవ్యుడైన హనిమిరెడ్డి వైఎస్ఆర్సిపి అద్దంకి నియోజకవర్గం అభ్యర్థిగా గత నాలుగు నెలల నుండి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు...
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మండలానికి ఒక ఇంచార్జ్ ప్రచార బాధ్యతలు ఎలక్షన్ ఇంజనీరింగ్ కి సంబంధించి బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు...
అనిమిరెడ్డి పల్లె పల్లెకు ప్రోగ్రాం నిర్వహిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ లబ్ధిదారులు ప్రజల లో తాను ఒక్కడై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..
పేదల సంక్షేమ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు..
ఇక రాజకీయాలలో దిట్ట.. అద్దంకి నియోజకవర్గంలో తిరుగులేని వ్యక్తిగత గుర్తింపు సంపాదించిన గొట్టిపాటి రవికుమార్ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు...
అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని.. ఒకపక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నట్లు చెబుతూ మరోవైపు ప్రజల మీద వివిధ రకాల మోతలు మోపుతూ హింసిస్తున్న వైసిపి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు...
మరోవైపు సూపర్ సిక్స్ పథకాల ప్రయోజనాల గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు గొట్టిపాటి....
గొట్టిపాటి తరఫున ఆయన భార్య ఝాన్సీ కుమారుడు హర్ష వర్ధన్ తదితరులు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0