వైయస్ కుటుంబానికి 30 ఏళ్ల ప్రత్యర్థి సతీష్ రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్లిన వైసిపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కడప మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్
వైయస్ కుటుంబానికి 30 ఏళ్ల ప్రత్యర్థి సతీష్ రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్లిన వైసిపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కడప మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్
శాసన మండలి డిప్యూటీ మాజీ ఛైర్మన్ సతీష్ కుమార్ రెడ్డిని వైకాపా పార్టీలోకి ఆహ్వానించేందుకు వైసిపి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు...
గత 30 సంవత్సరాలుగా టిడిపి పార్టీలో ఉంటూ వైఎస్ కుటుంబంతో సతీష్ రెడ్డి రాజకీయ పోరాటం జరిపారు...
అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం ఏ పార్టీ యాక్టివిటీస్ లో లేరు..
ఇటీవల కడప జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు నేపథ్యంలో వైయస్ షర్మిల బ్రదర్ అనిల్ తెలుగుదేశం జనసేనతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా నడుపుతున్న రాజకీయాల నడుమ సతీష్ రెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి చేర్చుకోవాలని ఆలోచనకు వచ్చారు...
ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి కడప మేయర్ సురేష్ ను దూతలుగా పంపి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం...
ఆయనకు పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత సీఎం జగన్ మోహన్ రెడ్డి కల్పిస్తానని తన మాటగా చెప్పమన్నట్లు రామ సుబ్బారెడ్డి విలేకరులకు తెలిపారు...
సతీష్ రెడ్డి రెండు మూడు రోజుల్లో తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తెలియజేస్తానని చెప్పినట్లు రామసుబ్బారెడ్డి తెలిపారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0