ఆంధ్రప్రదేశ్లోని లబ్ధిదారుల 14 వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ ఈనెల 14న చేసుకోవచ్చు...రాష్ట్ర హైకోర్టు
ఆంధ్రప్రదేశ్లోని లబ్ధిదారుల 14 వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ ఈనెల 14న చేసుకోవచ్చు...రాష్ట్ర హైకోర్టు
ఈనెల 13న ఎలక్షన్లు పూర్తికాగానే మరుసటి రోజు 14వ తేదీన డిబిటి ద్వారా లబ్ధిదారులకు నగదు బదిలీ చేయవచ్చు అని రాష్ట్ర హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది..
ఆసరా, చేయూత, విద్యాదీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాల కింద డిబిటి ద్వారా లబ్ధిదారులకు 14000 కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ కావలసి ఉంది...
ఇవి ఎప్పటినుంచో లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం అందుతున్న పథకాలు అయినందున ఎలక్షన్ కమిషన్ నిధుల విడుదలకు ఆటంకం కలిగించటం సహేతుకం కాదని కొందరు లబ్ధిదారులు హైకోర్టుకు వెళ్లారు...
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 10వ తేదీ ఈరోజు మాత్రమే నగదు బదిలీ చేసే అవకాశాన్ని కల్పించింది...
అయితే దీనిపై నవతరం పార్టీ తరపున కొందరు హైకోర్టుకు వెళ్ళగా కోర్టు ఈ విధంగా మరలా తాజాగా తీర్పునిచ్చింది..
ఇప్పుడు ఇంకా రెండు రోజుల్లో ఎలక్షన్ ఉందని అనగా నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు వారి వారి అకౌంట్లో వారికి అందవలసిన డబ్బు పడితే అది డైరెక్ట్ గా వారిని ప్రభావితం చేయడమే అవుతుందని ఎలక్షన్ కమిషన్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించి 14వ తేదీన అంటే ఎలక్షన్ ముగిసిన మరుసటి రోజు నగదు బదిలీ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది..
దీంతో నాలుగు రోజులు తమ పథకాల ద్వారా డబ్బు అందుకునేందుకు లబ్ధిదారులు వేచి చూడాల్సిందే
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0