పెనమలూరు నందిగామ నంద్యాల ప్రాంతాల నుండి కీలక తెలుగుదేశం నేతలు వైసీపీలో చేరిక
పెనమలూరు నందిగామ నంద్యాల ప్రాంతాల నుండి కీలక తెలుగుదేశం నేతలు వైసీపీలో చేరిక
అధికార పార్టీ నుండి టిడిపిలోకి వలసలు ఉండవలసింది పోయి టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు రాష్ట్రంలో అధికమవుతున్నాయి...
2019లో విజయనగరం అసెంబ్లీకి టికెట్ దక్కని మీసాల గీత 2024 లో కూడా చంద్రబాబు మొండి చేయి చూపడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు..
ఇక కడప జిల్లాకు చెందిన కమలాపురం టికెట్ ఆశించిన వీర శివారెడ్డి కడపలో టిడిపి పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని సంచలన ప్రకటన చేశారు...
అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను బట్టి కాక కేవలం డబ్బున్న వ్యక్తులకి టికెట్లు ఇస్తే గెలుస్తారనే భ్రమలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని విమర్శించారు..
త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు..
పెనమలూరు నుండి టికెట్ ఆశించి భంగపడ్డ చలసాని పండు కుమార్తె స్మిత... దేవినేని గౌతమ్ దంపతులు ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు..
మరో బిసి నేత ఉమావల్లి యాదవ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు..
నందిగామ నుండి కీలక టిడిపి నాయకులు., నంద్యాల నుండి ముస్లిం ప్రముఖులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు...
ఇక నెల్లూరులో మల్లి రెడ్డి శ్రీనివాసరెడ్డి కోటిరెడ్డి ప్రభావంతో పలువురు టిడిపి జనసేన నాయకులు వైసీపీలోకి చేరుతున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0