పిఠాపురం పెనమలూరు కొవ్వూరు ఎచ్చెర్ల నియోజకవర్గం లలో టిడిపి శ్రేణుల ఆందోళన
పిఠాపురం పెనమలూరు కొవ్వూరు ఎచ్చెర్ల నియోజకవర్గం లలో టిడిపి శ్రేణుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం రెండవ లిస్టుపై పార్టీ శ్రేణులు వివిధ ప్రాంతాలలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి...
పిఠాపురంలో తను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో నరేంద్ర వర్మ వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పార్టీ ఫ్లెక్సీలు జెండాలు తగలబెట్టారు...
నరేంద్ర వర్మను ఇండిపెండెంట్గా పోటీ చేయమని కార్యకర్తలు అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు..
పెనమలూరు లో బోడె ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఒక్క చంద్రబాబు కుటుంబం తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా పోటీ చేస్తామంటే సహకరించేది లేదు అని స్పష్టం చేస్తున్నారు..
వేరే వ్యక్తులు వస్తే తాను ఇండిపెండెంట్గా బరిలో ఉండి చంద్రబాబు భక్తుడిగా పెనమలూరు గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు...
కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ కి టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ఎచ్చెర్లలో కళా వెంకట్రావు పేరు రెండవ లిస్టులో కూడా ప్రకటించకపోవడంతో వెంకటరావు వర్గం ఇలా అధిష్టానం చేయడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని వెంటనే వెంకట్రావును నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు...
ఇక గంటా శ్రీనివాసరావు తన అనుచరులు అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచన చేస్తున్నారు...
బండారు సత్యనారాయణమూర్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టికెట్ కేటాయించకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు..
పెదకూరపాడు నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ కి టికెట్ దక్కలేదు...భాష్యం ప్రవీణ్ కి పెదకూరపాడు అధిష్టానం కేటాయించింది..
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా రెండవ లిస్టులో చోటుదక్కలేదు...
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతికి కొవ్వూరు సీటు టిడిపి అధిష్టానం కేటాయించింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0