రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా పై వైసీపీ నేతల స్పందన
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా పై వైసీపీ నేతల స్పందన
ఆర్ కృష్ణయ్య రాజీనామా పై వైసీపీ మాజీ మంత్రుల స్పందన
తాడేపల్లి:
చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు.
- ఎంతో గౌరవించి బీసీల అభ్యున్నతికి పాటుపడతారన్న ఆకాంక్షతో జగన్ గారు కృష్ణయ్యకు పదవి ఇచ్చారు.
- పార్టీలో ఎంతో మంది ఉన్నా.. కృష్ణయ్య ద్వారా దేశ రాజధానిలో, పార్లమెంటులో బీసీల వాణి వినిపిస్తుందని నమ్మకంతో, విశ్వాసంతో రాజ్యసభ పదవిని కట్టబెట్టారు.
- అలాంటి ఉదాత్త సంకల్పాన్ని నీరుగారుస్తూ.. చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు తలొగ్గి కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం, నష్టం చేకూర్చారు.
- చంద్రబాబు కొనుగోలు, కృష్ణయ్య రాజీనామా ఈ రెండు అంశాలను ప్రజలు గమనిస్తున్నారు.
- తన పరిపాలన ద్వారా ప్రజలకు సమర్థ పాలన చంద్రబాబు అందించలేకపోతున్నారు.
- ఆ అంశాలను మరుగున పరచడానికి ఇలాంటి ఎత్తుగడలు తీసుకుంటున్నారు.
- రాజీనామా చేసిన వారికి కొంత ఇచ్చి, ఆ ఖాళీ అయిన సీట్లను పదిరెట్లకు చంద్రబాబు అమ్ముకుంటున్నాడు.
- చంద్రబాబుకు ఇదొక లాభసాటి వ్యాపారంగా మారింది. రాజకీయాల్లో బాబు నయా మార్కెటింగ్ వ్యవహారమిది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
- ఇలాంటి వాటికి కృష్ణయ్య తలొగ్గి రాజకీయంగా బీసీలకు తీరని ద్రోహం చేశారు.
- ఇలాంటి వ్యవహారాలతో వైయస్సార్ సీపీని బలహీనపర్చలేరు.
- అంతకుమించి రెట్టింపు స్పందనతో సమయం వచ్చినప్పుడు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0