వైసిపి అభ్యర్థులు వై వి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడ రఘునాథరెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇకలాంచనమే
వైసిపి అభ్యర్థులు వై వి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడ రఘునాథరెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇకలాంచనమే
నెల్లూరుకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు వేసిన నామినేషన్ చెల్లదని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ఇక లాంచనమే...
వైఎస్ఆర్సిపి అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి నామినేషన్ లు వేశారు.. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను దించే ప్రతిపాదన విరమించుకోవడంతో వైసిపి అభ్యర్థుల ఎన్నిక ఇక ఏకగ్రీవం అన్న తరుణంలో అనూహ్యంగా పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ వేశారు....
అయితే నిబంధనల ప్రకారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి...అలా అయితేనే నామినేషన్ చెల్లుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల మద్దతు లేకుండా నామినేషన్ వేయడంతో సదరు నామినేషన్ చెల్లదని ఎన్నికల అధికారి ప్రకటించారు..
దీంతో ముగ్గురు వైసీపీ అభ్యర్థుల రాజ్యసభ సభ్యుల అభ్యర్థిత్వాలను ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి ప్రకటించడమే తరువాయి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0