తెలుగుదేశం శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అధినేత చంద్రబాబు
తెలుగుదేశం శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అధినేత చంద్రబాబు
రానున్న ఎన్నికలలో పొత్తు ధర్మం దృష్ట్యా పాత కాపులకు కొన్ని స్థానాల్లో సీట్లు దక్కకపోవచ్చు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీట్లు దక్కని వారికి రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని నమ్మబలికే ప్రయత్నం చేశారు... వైసీపీలో విసిగిపోయిన నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా, వారిలో సమర్ధులైన,,, మంచి వ్యక్తిత్వం ఉన్నవారికి సీట్లు ఇవ్వక తప్పదని అలాంటి వారికి టిడిపి క్యాడర్ సహకరించాల్సిందేనని తెలిపారు...
అయితే చంద్రబాబు నాయుడు చెప్పినంత తేలిక కాదు ఆచరణలో ఆ విషయం అని తెలుగుదేశం శ్రేణులు రుస రుసలాడుతున్నాయి... వైసీపీ ప్రభుత్వ కాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ఎంతో కృషి చేసిన నాయకులను విస్మరించి వారికి టిక్కెట్లు ఇవ్వకుండా వలస వచ్చిన వారికి పొత్తుల్లో భాగంగా జనసేన లాంటి పార్టీలకు టికెట్లు కేటాయిస్తామని... త్యాగం చేయమని చంద్రబాబు నాయుడు కోరడం టిడిపి క్యాడర్ కు మింగుడు పడడం లేదు...
ఇప్పటికే నూజివీడులో పార్థసారథి రాకతో ముద్రబోయిన వెంకటేశ్వరరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు... బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు...అదేవిధంగా దేవినేని ఉమ...బోడె ప్రసాద్ వంటి వారు కూడా చంద్రబాబు తమకు టికెట్లు కేటాయిస్తారా లేదా అనే ఆందోళనలో ఉన్నారు...
ఒకవేళ టికెట్లు కేటాయించకపోతే అంత తేలిగ్గా... వచ్చిన కొత్త వారిని, అసంతృప్తి అసమ్మతి నాయకులు అక్కున చేర్చుకుంటారా అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న....
దేవినేని ఉమ కూడా వసంత కృష్ణ ప్రసాద్ పై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు చేశారు... బోడె ప్రసాద్ తనదే పెనమలూరు టిడిపి టికెట్ అని రూమర్లను పట్టించుకోవద్దని అధిష్టానం తనకు అన్యాయం చేయదని కార్యకర్తలకి ఆందోళన చెందవద్దని చెబుతున్నా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చునే స్పష్టతను తెలియజేస్తున్నాయి...
అలాగే రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్లకు టికెట్ దక్కకపోవచ్చునే వాదన బలంగా ఉంది..పొత్తుల భాగంలో కావచ్చు..వలస వచ్చిన వైసిపి నాయకుల వల్ల కావచ్చు తెలుగుదేశం పార్టీలో భారీగా అసమ్మతి అసంతృప్తి జ్వాలలు నియోజకవర్గాల టికెట్లు అధికారికంగా చంద్రబాబు ప్రకటించిన అనంతరం ఎగసి పడతాయన పరిశీలకుల అంచనా
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0