మూడు రాజధానుల కథాంశంగా విడుదల కానున్న రాజధాని ఫైల్స్ సినిమాకు రేపటి వరకు బ్రేక్
మూడు రాజధానుల కథాంశంగా విడుదల కానున్న రాజధాని ఫైల్స్ సినిమాకు రేపటి వరకు బ్రేక్
మూడు రాజధానుల కథాంశంగా రూపొందించిన రాజధాని ఫైల్స్ రేపు విడుదల కావలసి ఉండగా రేపటి వరకు విడుదల చేయవద్దని రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది...
మూడు రాజధానుల అంశం కోర్టు వివాదంలో ఉన్నందున.. రాజకీయ ఉద్దేశంతో సినిమా చిత్రీకరించినందున..సినిమా విడుదలను నిలిపివేయాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర హైకోర్టులో పిల్ వేశారు...
సీఎం జగన్... కొడాలి నాని టార్గెట్గా వారి క్యారెక్టర్లకు దురుద్దేశాలు ఆపాదిస్తూ సినిమా నిర్మించడం జరిగిందని అప్పిరెడ్డి పేర్కొన్నారు...
ఈ చిత్రం ఎవరిని ఉద్దేశించి తీయలేదని రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ఇబ్బందులను చిత్రీకరిస్తూ మాత్రమే తీశాము అని చిత్ర నిర్మాత తరఫున లాయర్ వాదించారు...
సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా అభ్యంతరాలు తెలపడం సరికాదని అన్నారు..
ఇరువురి తరుపున వాదనలు విన్న న్యాయమూర్తి నిన్న తీర్పును రిజర్వ్ చేసి...నేడు రేపటి వరకు సినిమాను విడుదల చేయవద్దని... సినిమాకు సంబంధించిన రికార్డులు అన్ని నేడు కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ రేపటికి తదుపరి విచారణను వాయిదా వేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0