హరి రామ జోగయ్య వంతు అయిపోయింది ఇక ముద్రగడ తనదైన స్టైల్ లో పవన్ కళ్యాణ్ కు లేఖాస్త్రం
హరి రామ జోగయ్య వంతు అయిపోయింది ఇక ముద్రగడ తనదైన స్టైల్ లో పవన్ కళ్యాణ్ కు లేఖాస్త్రం
మిత్రులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారములు...
అంటూ లేఖను ప్రారంభించి ముద్రగడ తన బాధను ఆవేదనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు...
మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నప్పటికీ వారి అందరి కోరిక మేరకు నా గతం నా బాధలు అవమానాలు ఆశయాలు కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను....రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను...
మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను కాని దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదు..
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టిడిపి క్యాడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితమైపోయిన సమయంలో అటువంటి కష్ట కాలంలో మీరు ఆయన వద్దకు వెళ్లి ఆయన పరపతిని హఠాత్తుగా పెంచేశారు...
గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని తహతహలాడారు...
పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80 స్థానాల లో ఎన్నికల బరిలో ఉండడంతో పాటు.... మొదటి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలి...
కానీ ఆ సాహసం చేయలేకపోవడం దురదృష్టకరం..
మీలాగే గ్లామర్ ఉన్న వారిని కాకపోవడం...
ప్రజలలో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడటం వల్ల మీరు నా వద్దకు రాలేకపోయారు...
మీ నిర్ణయం మీ చేతిలో ఉండదు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి...
మీరు పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు రాకూడదు అని భగవంతుని ప్రార్థిస్తున్నాను...
ఆల్ ది బెస్ట్ అండి అని ముగించారు ముద్రగడ
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0