బుడమేరు వాగుకు మళ్ళీ గండి.. బురదలోనే బెజవాడ సింగ్ నగర్ తదితర ప్రాంతాలు
బుడమేరు వాగుకు మళ్ళీ గండి.. బురదలోనే బెజవాడ సింగ్ నగర్ తదితర ప్రాంతాలు
బురదలోనే బెజవాడ..
నిన్నటి దాకా బుడమేరు వరదను తట్టుకోలేక కకావికలైన బెజవాడ ఇప్పుడు బ
బుడమేరు వరద ముంపుతో నిండా మునిగిన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ముంపుకు గురైన ఆయా కాలనీల్లో జలదిగ్బంధం వీడటంతో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న జనం ఇంటి బాట పట్టారు.
అజిత్ సింగ్ నగర్ ప్రాంతం, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబే కాలనీ, కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, తోట వారి వీధి, కృష్ణ హోటల్ సెంటర్, రాజీవ్ నగర్ వుడా,కాలనీ, ఎల్ బి ఎస్ నగర్, యాడ్ రోడ్డు, డాబా కోట్లు, వివేకానంద స్కూల్, స్మైల్ హాస్పిటల్, తదితర ప్రాంతాల్లో బురదలో కూరుకుపోయాయి. ఎటు చూసినా చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలు, విరిగి పడిన చెట్టు కొమ్మలు. ఇళ్ల నుంచి బయటకు కొట్టుకు వచ్చిన సామాన్లతో ఈ కాలనీలు అన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
విజయవాడ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది రంగంలోకి దిగి పని చేస్తున్నారు. కొందరు సేవా స్ఫూర్తితో స్వచ్చందంగా పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే బుడమేరుకు తాజాగా మళ్ళీ గండి పడినట్లు తెలుస్తోంది.
సింగ్ నగర్ ప్రాంత ప్రజలు అప్రమత్తమై ప్రతి ఒక్కరూ మళ్లీ ఇళ్లు ఖాళీ చేయవలసిందిగా పోలీసులు పిలుపు ఇచ్చారు. గండి అదుపులోకి రాకుండా ఈ వరద ఇలాగే ప్రవహిస్తే ప్రాణాపాయం తప్పదని పోలీసు వారు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు హెచ్చరిస్తున్నాయి..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0