రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం ఎంతైనా ఉంది ...ప్రధాని మోదీ
రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం ఎంతైనా ఉంది ...ప్రధాని మోదీ
చిలకలూరిపేట ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ ప్రసంగంపై ఎంతో ఆశించి ఉండొచ్చు..
ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది..
అయితే ప్రధాని మోదీ తన ప్రసంగంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని రాష్ట్రంలో మంత్రులు ఒకరిని మించి ఒకరు అవినీతి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడంలేదని విమర్శించారు..
వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీలో వేరు వేరు కాదని అవి రెండూ ఒకటేనని ఒకే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులే ఆ పార్టీలను నిర్వహిస్తున్నారని తెలిపారు.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను చీల్చి లాభపడేందుకు వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది అని మోది విమర్శించారు..
అయితే రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు..
ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఈ 10 ఏళ్ల కాలంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం బారి నుండి బయటపడేట్టు చేసిందన్నారు.
ఇక తెలుగుదేశం ఎన్డీఏ చేరికతో ఎన్డీఏ బలపడిందని తెలిపారు..
రాష్ట్రం గర్వించదగ్గ తెలుగు బిడ్డలైన పీవీ నరసింహారావుకి భారతరత్నం ఇవ్వడం ద్వారా... ఎన్టీఆర్ స్మారకార్థం స్మారక నాణాన్ని విడుదల చేయడం ద్వారా.. తెలుగు ప్రజలపై ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న మమకారాన్ని చాటుకుందని తెలిపారు..
అదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులైన పీవీ నరసింహారావుని అవమానించిందని తెలిపారు..
చిలకలూరిపేటలో నాకు త్రిమూర్తుల ఆశీర్వాదం లభించింది.. 400 సీట్లు రావాలి ఎన్డీఏకు ఓటు వేయాలి అని మోడీ తెలుగులో ప్రసంగించారు..
ఇక చంద్రబాబు నాయుడు జగన్ మీద ఉన్న తన ఆక్రోసాన్ని వెళ్లగక్కారు ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలో తెలియక అగమ్య గోచరంగా నిస్సారంగా జగన్ ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రసంగం కొనసాగింది..
పవన్ కళ్యాణ్ సరే సరే జగన్ టార్గెట్ గానే ప్రసంగించారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0