ఓపిక ఉంటే జనాభాను పెంచండి రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు కొత్త పిలుపు
ఓపిక ఉంటే జనాభాను పెంచండి రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు కొత్త పిలుపు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొత్త పిలుపునిచ్చారు ప్రజాగళం రాప్తాడు సభలో ప్రసంగిస్తూ పిల్లలు దేశ సంపద వారి అవసరం చాలా ఉంది ఆడపిల్లలు పుడితే వారికి మరింత ప్రాధాన్యత ఇస్తాను ఓపిక ఉంటే జనాభాను పెంచండి అన్నారు...
ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అన్ని 15వేల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తుందని వెల్లడించారు...
వైయస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు....
కరెంటు చార్జీలు అమాంతం పెంచేసి సామాన్యుల నెత్తిన భారం వేశారని విమర్శించారు.... నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, డీఎస్సీ కల్పిస్తామని మోసం చేశారని అన్నారు...
తమకు ఓటు వేస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి దాని మాట మరిచిపోయారన్నారు....
పోలవరాన్ని గోదావరిలో ముంచిన ఘనుడిగా అభివర్ణించారు....
జి బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు మళ్ళించారని తెలిపారు...
తాను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తానని తెలిపారు..
నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు చొప్పున భృతి అందిస్తామని తెలిపారు...
అధికారంలోకి రాగానే చేస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ అని తెలిపారు..
తాను సంపద సృష్టిస్తానని..తద్వారా సంక్షేమ పథకాల తో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అంటూ తన సహజ శైలిలో చంద్రబాబు ప్రసంగించారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0