శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి బొజ్జలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న స్వపక్ష మిత్రపక్ష కూటమి
శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి బొజ్జలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న స్వపక్ష మిత్రపక్ష కూటమి
శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా టిడిపి,జనసేన, బిజెపి పార్టీలలోని ఆయన ప్రత్యర్థులు పావులు కదుపుతున్నట్లు సమాచారం..
బొజ్జల సుధీర్ రెడ్డిని టిడిపి అభ్యర్థిగా కొనసాగిస్తే వైకాపా బంపర్ గెలుపు ఖాయం....
Svc నాయుడు టిడిపి...కోలా ఆనంద్ బిజెపి..వినుత కోట జనసేన లలో టికెట్ ఎవరికీ ఇచ్చినా కూటమిలోని అందరం కలిసి పనిచేస్తాం అని టిడిపి అధిష్టానానికి సంకేతాలు...
మా అభ్యర్థనను పరిశీలించి బొజ్జలను మార్చండి లేకపోతే తాము సహకరించేది లేమని వారు కరాకండిగా తేల్చి చెబుతున్నారు...
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని బొజ్జల సుధీర్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం వైసిపి కి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రానున్న ఎన్నికల్లో నామమాత్రపు పోటీతో అర్పించడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
నియోజకవర్గ అతిధి లాగా హైదరాబాదులో ఉంటూ అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చే బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం తెలిసి తెలిసి గోతి తవ్వుకోవడమేనని వారు హెచ్చరిస్తున్నారు..
టికెట్ తనకు ఖరారు కావడంతో బొజ్జల అనుచరులు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వినుత కోట ఇంటి ముందు ఆరోజు భారీ ఎత్తున బాణసంచా పేల్చారు..
ఇలాంటి పిల్ల చేష్టలతో వ్యవహరించే బొజ్జలకు టికెట్ ఇస్తే ఎలాంటి పరిస్థితుల్లో సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు..
జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు నాయుడు వద్ద కూడా మరో మారు శ్రీకాళహస్తి అభ్యర్థి మార్పును పరిశీలించాలని లేకుంటే పక్కాగా తెలుగుదేశం టికెట్ శ్రీకాళహస్తిలో గెలవదని ఆయనకు తెలియజేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0