మాగుంట, వేమిరెడ్డి పార్టీ మారితే వైసీపీకి, సీఎం జగన్ కి షాక్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
మాగుంట, వేమిరెడ్డి పార్టీ మారితే వైసీపీకి, సీఎం జగన్ కి షాక్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల్లో టిడిపి తీర్థం పుచ్చుకోబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం... వారి సహజ టిడిపి అనుకూల బాకా శైలిలో భాగంగా సీఎం జగన్ కు షాక్ అనే బ్రేకింగ్ లు..
పార్లమెంట్ సమావేశాల అనంతరం ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి మా గుంట చంద్రబాబును కలుస్తారని ఒంగోలు ఎంపీగా టిడిపి తరఫున బరిలో నిలుస్తారని ప్రచారం..
ఈ విషయం కొత్తగా ఊహించింది ఏమీ కాదు... ఒక్క బాలినేని మాగుంట విషయంలో వైసిపి అధిష్టానాన్ని అడగడం మినహాయించి...ఆయనకు టికెట్ కేటాయించే ఉద్దేశం సీఎం జగన్ కు లేదు అనేది సుస్పష్టం..
మరి ఈ విషయాలు తెలిసిన టిడిపి అనుకూల మీడియా అనవసర రాద్ధాంతం చేస్తూ అభాస పాలు కావడంతో పాటు నిత్యం అబద్దాలు కుమ్మరించి సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు కక్కటం వారి మీడియా స్థాయి దిగజార్చుకోవడంతోపాటు పరోక్షంగా టిడిపికి నష్టం కలిగిస్తున్నారనేది చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నారు..
అదేవిధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున ప్రచారంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిజెపి లో చేరి నెల్లూరు ఎంపీగా బరిలో ఉంటే.. ఆయన చెప్పిన వారికి ఆయన అడిగిన అసెంబ్లీ నియోజకవర్గం కూడా కేటాయిస్తామని టిడిపి అధిష్టానం చెబుతున్నట్లు మరో ప్రచారం...
వేమిరెడ్డికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యతనే ఇచ్చారు.. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వడంతో పాటు ఆయన భార్యకు టిటిడి లో కీలక బాధ్యతను కూడా ఇచ్చారు..
అయితే ప్రతి ఒక్కరూ గొంతెమ్మ కోరికలు కోరితే అవి అన్ని తీర్చడం సీఎం జగన్ చేస్తారనేది అనుకోవడం పిచ్చి పొరపాటు అవుతుంది.. ఆయనకు కూడా కొన్ని ఆలోచనలు ఆయా వ్యక్తుల పట్ల ఉంటాయి.. అందుకు అనుగుణంగా జగన్ నిర్ణయాలు తీసుకోవచ్చు...
ప్రతిదీ మేం చెప్పినట్లే జరగాలి అని...వేమిరెడ్డి కావచ్చు... బాలినేని కావచ్చు.. మరి ఏ ఇతర నాయకులైనా కావచ్చు... అలా చేయటం సీఎం జగన్ కు సాధ్యపడదు కదా..
అయితే వైసీపీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు...వారి అంతర్గత వ్యవహారాలు కావచ్చు.. ఈ అంశాల పట్ల తెలుగుదేశం అనుకూల మీడియా చేసే అబద్ధపు ప్రచారం గుడ్డిగా నమ్మేంత అవివేకులు ప్రజలు కారు అనేది అక్షర సత్యం అని పలువురి అభిప్రాయం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0