పార్వతీపురం మన్యం జిల్లాలో దబ్బ గడ్డ లో భర్తతో కలిసి ఆనందంగా నృత్యం చేసిన కొద్దిసేపటికి డిహైడ్రేషన్తో మృతి చెందిన నూతన వధువు
పార్వతీపురం మన్యం జిల్లాలో దబ్బ గడ్డ లో భర్తతో కలిసి ఆనందంగా నృత్యం చేసిన కొద్దిసేపటికి డిహైడ్రేషన్తో మృతి చెందిన నూతన వధువు
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బ గెడ్డలో పెళ్లి ఇంట విషాదం జరిగింది...
పెళ్లి అయిన ఆనందంలో భర్తతో కలిసి నృత్యం చేసిన నూతన వధువు కొన్ని గంటల వ్యవధిలోని మృత్యువాత పడ్డది..
దబ్బగెడ్డ గ్రామానికి చెందిన భాస్కరరావుతో కొత్తవలస గ్రామానికి చెందిన అఖిలకి 20 శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది...
వాళ్ల ఆచారం ప్రకారం మాంగల్య ధారణ అనంతరం శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఊరేగింపు సాగింది..
డీజే పాటలకు భర్తతో కలిసి అఖిల నృత్యం చేసింది..
అనంతరం నీరసంగా ఉంది అంటూ నిద్ర పోయింది..
తర్వాత బంధువులు వెళ్లి లేపగా ఎంతకు లేవకపోవడంతో వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు...
అక్కడ వైద్యులు ఆమెను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు...
ముందు రోజు ఉపవాసం ఉండడంతో పాటు పెళ్లి తర్వాత నృత్యం చేయడం వల్ల డిహైడ్రేషన్కు గురి అయి మృతి చెంది ఉండవచ్చు అని భావిస్తున్నారు..
తల్లిదండ్రులు లేని అఖిలను పెంచి పెద్ద చేసిన ఆమె తాతయ్య నానమ్మలకు తీవ్ర దుఃఖమే మిగిలింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0