తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇక నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు
తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇక నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు
నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది...
ఆయన తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు...
టీచర్స్ ఎమ్మెల్సీ పోటీలో తనదైన శైలిలో ప్రణాళికబద్ధంగా కృషి చేసి పోటీలో నెగ్గారు..
సాంప్రదాయంగా యుటిఎఫ్ మద్దతుదారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల మద్దతుతో గెలుస్తుంటారు.. అందుకు భిన్నంగా చంద్రశేఖర్ రెడ్డి విజయం కైవసం చేసుకున్నారు....
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరిగిన మార్పుల వల్ల వేమిరెడ్డి టిడిపిలోకి వెళ్లిపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలని సమాలోచనలు చేసి పర్వత రెడ్డి వైపు సీఎం జగన్ మొగ్గు చూపినట్లు సమాచారం..
విద్యా సంస్థల అధినేతగా నెల్లూరు జిల్లాలో మంచి గుర్తింపు ఉండడం తో పాటు కలివిడి మనస్తత్వంతో అందరినీ కలుపుకుపోయే సామర్థ్యం పర్వత రెడ్డికి ఉందని భావించి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం..
ఇప్పటికే పర్వత రెడ్డి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఖలీల్ కి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు...
ఇక సిద్ధం సభ ముగిసిన తర్వాత నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జ్ ..ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జిల్లా మొత్తాన్ని సమన్వయం చేసే పనిలో ఉంటారని సమాచారం...
ఆయనకు తోడుగా పర్వతరెడ్డిని నియమించడం ద్వారా జిల్లాలో వైసీపీ ఆధిక్యతను నిలుపుకొనే ప్రయత్నం అధిష్టానం చేస్తుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0