ముద్రగడ ఆయన కుమారుడు వైసీపీలో చేరనున్నట్లు సమాచారం
ముద్రగడ ఆయన కుమారుడు వైసీపీలో చేరనున్నట్లు సమాచారం
వైసిపి ముద్రగడ పద్మనాభం ని ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమైనట్లు సమాచారం...
జనవరి నెల కు ముందు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతాడు అన్నట్లు పుకార్లు అయితే వచ్చాయి...
జనవరి నెలలో పద్మనాభం అభిమానులతో ఆత్మీయ సమావేశాలు విందులు నిర్వహించారు...
జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు వెళ్లి కలిసి జనసేనలోకి ఆహ్వానించారు..
ఆ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి లోని ముద్రగడ పద్మనాభాన్ని కలిసి ఆయనను జనసేనలోకి ఆహ్వానిస్తారు అన్నట్లు లీకులు అయితే వచ్చాయి...
జనసేన నాయకులు కూడా ఇరువురి కలయిక జరుగుతుంది అనే అభిప్రాయంలో అయితే ఉన్నారు..
అయితే పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిరాన్ని దర్శించిన తరువాత కూడా ముద్రగడని కలవకపోవడం విశేషం...
ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల మద్రగడ పవన్ కళ్యాణ్ కి లేఖ కూడా రాశారు..
కాపు జాతి ఇద్దరి కలయికను ఆశిస్తుంది అని... 80 సీట్లు.. తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంలో అడిగి ఉండవలసిందని...పవర్ షేరింగ్ అడిగి ఉండవలసింది అని...అయితే అలా జరగకపోవడం పట్ల బాధగా ఉందని ముద్రగడ లేఖను రాస్తూ..
నన్ను కలవడానికి మీకు పర్మిషన్ కావాలేమో అని కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ తనదైన శైలిలో చురకలు అంటిస్తూ లేఖ రాశారు..
ఈ పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న వైసీపీ అధినాయకత్వం ముద్రగడతో చర్చలు జరిపింది..
ఈ నేపథ్యంలో ముద్రగడ ను పిఠాపురం నుండి పోటీ చేయించేందుకు సమాయత్తమవుతుంది..
అందుకు ముద్రగడ కూడా అంగీకరించినట్లు సమాచారం
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0