ఏప్రిల్ 30న ఒంగోలులో ప్రారంభమై మే ఆరవ తేదీ ఏలూరులో ముగియనున్న ప్రచారం
ఏప్రిల్ 30న ఒంగోలులో ప్రారంభమై మే ఆరవ తేదీ ఏలూరులో ముగియనున్న ప్రచారం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి సిద్ధం అయ్యారు...
ఏప్రిల్ 30వ తేదీ ఒంగోలులో ప్రారంభమై మే ఆరవ తేదీన ఏలూరులో ప్రచారాన్ని ముగిస్తారు..
రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో వారం రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు...
ఈనెల 30న ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరులో యువగళం సభలు కొనసాగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో సాగే ముఖాముఖి సమావేశాల్లో యువతీయువకుల సందేహాలను లోకేశ్ నివృత్తి చేస్తారు...
ప్రతిరోజూ ఓ పార్లమెంటు కేంద్రంలో నిర్వహించే ఈ ముఖాముఖి సమావేశాల్లో… రాబోయే ఎన్నికల్లో యువత నెరవేర్చాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు తాము ఏ విధంగా భరోసా కల్పిస్తామో లోకేశ్ వివరిస్తారు.....
ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల ద్వారా అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఉద్యోగం వచ్చేవరకు యువగళం పేరుతో ప్రతినెలా 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి హామీలపై యువతకు అవగాహన కల్పిస్తారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0