పర్చూరుకు ఎడం బాలాజీ కందుకూరుకు కటారి అరవింద యాదవ్ నూతన వైసిపి ఇన్చార్జులుగా నియామకం
పర్చూరుకు ఎడం బాలాజీ కందుకూరుకు కటారి అరవింద యాదవ్ నూతన వైసిపి ఇన్చార్జులుగా నియామకం
పర్చూరు.. కందుకూరు నియోజకవర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నూతన ఇన్చార్జులను ఎంపిక చేశారు...
పర్చూరుకు ఎడం బాలాజీని నూతన సమన్వయకర్తగా నియమించారు.. ఎడం బాలాజీ వైసీపీకి పాత కాపే... గతంలో చీరాలకు వైసీపీ ఇన్చార్జిగా వ్యవహరించారు అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించకుండా ఆమంచి కృష్ణమోహన్ కి టికెట్ ఇవ్వడంతో అలకబూనిన బాలాజీ టిడిపిలో చేరారు.. అయితే అక్కడ కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం తో స్తబ్దుగా ఉన్నారు... ఆయనను పర్చూరు ఇన్చార్జిగా నియమించడంతో మరలా తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు...
ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుండే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉండటంతో ఎడం బాలాజీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి... మరి ఆమంచి ఇటీవల సీఎంను కలిసి ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత చీరాలలోనే పోటీకి సిద్ధం అవుతున్నట్లు తన అనుచర వర్గానికి స్పష్టం చేశారు.. అయితే సీఎం చీరాల విషయమై ఎలాంటి స్పష్టత ఇచ్చారనేది బయటికి రాలేదు.. గతంలో ఆమంచి పర్చూరు నియోజకవర్గానికి ఇన్చార్జిగా వెళ్లే సమయం లో కరణం కి చీరాల టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని మధ్యే మార్గంగా బీసీకి కేటాయిస్తే పర్చూరు నుండి పోటీ చేస్తానని సీఎంతో అన్నట్లు సమాచారం
కరణం వెంకటేష్ పూర్తి స్థాయిలో చికిత్స పొందిన అనంతరం ఒంగోలు తిరిగివచ్చి తన నివాసంలో ఇటీవల చీరాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసిపి తరఫున చీరాలలో పోటీ చేసేది తానేనని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో మరి చీరాల రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అనే ఆసక్తి నెలకొంది..
ఇక గూడూరు ఆదిశంకరాచార్య విద్యాసంస్థల అధినేత వి పెంచలయ్య కుమార్తె కటారి అరవింద్ యాదవ్ ను కందుకూరు నూతన ఇంచార్జిగా సీఎం ఎంపిక చేశారు.. మరి మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతారా లేదా టిడిపి అవకాశం ఇస్తే అందులోకి వెళ్తారా అనేది వేచి చూడాల్సిందే..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0