తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అసంధర్భ వ్యాఖ్యలు మొదటికే మోసం తెస్తాయా?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అసంధర్భ వ్యాఖ్యలు మొదటికే మోసం తెస్తాయా?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచార సభలలో చేస్తున్న కొన్ని అసంధర్భ వ్యాఖ్యలు మొదటికే మోసం తెస్తాయేమోనని తెలుగుదేశం వర్గాలలోనే చర్చ జరుగుతుంది..
తెలుగుదేశం పార్టీకి ఓటు వేయని భర్తలకి అన్నం పెట్టకండి...
ఓపిక ఉంటే జనాభాను పెంచండి అంటూ వ్యాఖ్యలు చేశారు ఇటీవల జరిగిన సభలలో..
తాజాగా సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి..
టిప్పర్ డ్రైవరు.. నిశానిలకే వైసీపీ టికెట్ ఇస్తుంది అని వ్యాఖ్యానించారు...
ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో ఆయన హావభావాలు వ్యక్తపరిచిన తీరు తన స్థాయికి తగని రీతిగా ఉన్నాయనేది రాజకీయ పరిశీలకుల భావన...
అందుకు సీఎం జగన్మోహన్రెడ్డి ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభలో గట్టి కౌంటర్ ఇచ్చారు..
అయ్యా చంద్రబాబు వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ బిఈడి పూర్తి చేశారు మీ గవర్నమెంటులో ఉద్యోగం రాక టిప్పర్ డ్రైవర్ గా చేస్తున్నాడు.. మడకశిర వైసీపీ అభ్యర్థి లక్కప్ప కూలి గా జీవనం సాగిస్తున్నాడు..
పేదవారు ఎదగాలనేదే మా ఆలోచన అంటూ కౌంటర్ ఇచ్చారు...
నేను చాయ్ వాలాని అని చెప్పిన ప్రధాని విషయం ఏమంటారు..
కూలీ నాలి చేసుకునే రాజకీయ అవగాహన ఉండే సాధారణ వ్యక్తులు మరి రాజకీయంగా ఎదగకూడదని మీరు భావిస్తున్నారా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు..
మీ వ్యాఖ్యల ద్వారా మీ అంతరంగంలోని మనసులోని ఆలోచనలు బయటకు వస్తున్నాయి అని సూటిగా పలువురు ప్రశ్నిస్తున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0