కాసేపట్లో ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్న గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి...పిల్లి సుభాష్ చంద్రబోస్
కాసేపట్లో ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్న గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి...పిల్లి సుభాష్ చంద్రబోస్
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి కొద్దిసేపటి క్రితమే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ వెళ్లారు...
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంని వైసీపీలో చేర్చుకునేందుకు అధిష్టానం కసరత్తులు చేసింది...
ముద్రగడ కూడా తొలుత జనసేనలో వెళ్లాలని భావించిన అటు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో తన సహజ వ్యంగ్యాసాలతో పవన్ కళ్యాణ్ కి లేఖను రాయడం కూడా జరిగింది..
ఇక ముద్రగడ కూడా వైసీపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయానికి వచ్చిన తరుణంలో నిన్న జక్కంపూడి గణేష్ వెళ్లి ముద్రగడతో మాట్లాడి ఫోన్ ద్వారా మిధున్ రెడ్డికి కలపడం కూడా జరిగింది...
అయితే ముద్రగడ... సీఎం జగన్ కూడా తను చేరే విషయంలో సానుకూలంగా ఉన్నారా లేదా ఆయనకు తెలిసే జరుగుతుంది కదా.. ఈ సంప్రదింపు లు... అని మిథున్ రెడ్డిని ప్రశ్నించగా సీఎం జగన్ సమ్మతితోనే సంప్రదించటం జరిగిందని సమాధానం ఇచ్చారు..
ఈ నేపథ్యంలో నేడు స్వయంగా ద్వారంపూడి ఆయనను కిర్లంపూడి లో కలవడం జరిగింది...
మరి కాసేపట్లో మిథున్ రెడ్డి సుభాష్ చంద్రబోస్ కూడా కిర్లంపూడి రానున్నారు...
అయితే ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికలలో ప్రస్తుతం పాల్గొనడానికి ఆసక్తి చూపటం లేదనే విషయంలో భాగంగా తక్షణమే ఆయన కుమారుడు గిరి కి నామినేటెడ్ పదవి... ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు వైసిపి రంగం సిద్ధం చేసింది...
అంతేగాక ఎన్నికల అనంతరం ముద్రగడకు ఆయన హోదాకు తగిన రీతిలో నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు వైసిపి అధినాయకత్వం హామీ ఇస్తుంది...
ఇక దాదాపుగా ముద్రగడ వైసీపీలో చేరడం లాంచనమే అనే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0