రసవత్తరంగా మారిన అద్దంకి రాజకీయం.. అలా వెళ్తున్నారు.. ఇలా మరల తిరిగి వస్తున్నారు..
రసవత్తరంగా మారిన అద్దంకి రాజకీయం.. అలా వెళ్తున్నారు.. ఇలా మరల తిరిగి వస్తున్నారు..
అద్దంకి మునిసిపాలిటీ 13 వ వార్డు కి చెందిన ముఖ్య నాయకుడు దొండపాటి వెంకటరావు,నవీన్ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని కలిసి సంఘీభావం తెలపడం..మరలా నేడు వైసీపీలోకి రావడం కూడా జరిగిపోయింది...
రెండు రోజుల క్రితం మునిసిపల్ వైస్ చైర్మన్ దేసు పద్మేష్, ఇద్దరు కౌన్సిలర్లు గొట్టిపాటి దగ్గరికి వెళ్లి కండువా కప్పుకోవడం తిరిగి మరల వెనక్కి రావడం జరిగిపోయింది..
ఇప్పుడు తాజాగా 13వ వార్డు ముఖ్య నాయకుల విషయంలో కూడా ఇదే జరిగింది...
ఇక ఎలాంటి పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకుండా హనిమిరెడ్డి విజయానికి కృషి చేస్తామని వారు ప్రకటించారు...
ఎత్తులు వేయడంలో గొట్టిపాటి రవికుమార్ సిద్ధహస్తుడైనప్పటికీ అన్ని రోజులు అలా సాఫీగా సాగుతుంది అనుకోవడం పొరపాటే..
ఈ విధంగా వైసీపీ శ్రేణులను ఆకర్షించి వైసిపి నాయకత్వంని ఇరుకున పెట్టాలనే వ్యూహం ఉంటే ఉండొచ్చు...
కానీ హనుమ రెడ్డి కూడా నియోజకవర్గ ప్రజలలో కలిసిపోతూ ఆప్యాయంగా పలకరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తాను గెలిస్తే చేయనున్న పనులు కూడా వివరిస్తున్నారు...
ఇప్పటికే నియోజకవర్గంలో చిన్నచితక సమస్యలను తన సొంత నిధులతో పరిష్కరిస్తున్నారు...
నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు...
ఎన్నికల చదరంగంలో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసే టీం ని కూడా తయారు చేసుకున్నారు...
మొత్తానికి నియోజకవర్గ వైసిపి క్యాడర్ తో పాటు సామాన్య జనాలలో హనిమిరెడ్డి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లే...
ఈ కారణం చేతే వైసీపీలోకి ఇతర పార్టీల నుండి వలసలు పెరుగుతున్నాయి బల్లికురవ మండలంలో ఈరోజు 100 కుటుంబాలు బిఎస్పీ పార్టీని విడిచి హనిమిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు...
ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను ప్రత్యర్థుల ఎత్తులను తిప్పికొట్టే ప్రయత్నం వాళ్ళ టీం చేస్తుంది...
ఇంకా ముందు ముందు అద్దంకి రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0