మొన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి.. ఈరోజు నుండి వైవి సుబ్బారెడ్డి.. అభాసు పాలవుతున్న టిడిపి..
మొన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి.. ఈరోజు నుండి వైవి సుబ్బారెడ్డి.. అభాసు పాలవుతున్న టిడిపి..
మొన్న మొన్నటి వరకు విజయసాయి రెడ్డి పై విశాఖ డ్రగ్స్ రాకెట్ విషయంలో విష ప్రచారం చేసిన తెలుగుదేశం సోషల్ మీడియా ఈ రోజు నుండి వైవి సుబ్బారెడ్డి మీద దృష్టి కేంద్రీకరించింది..
వై వి సుబ్బారెడ్డి బ్రెజిల్ దేశానికి వెళ్లినట్లు తర్వాత బ్రెజిల్ ప్రతినిధులు ఆయనను ఇండియాలో కలిసినట్లు దీని వెనుక అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ అని అసత్య అసంబద్ధ ప్రచారాన్ని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తుంది...
వాస్తవానికి 2016లో తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఆయన బ్రెజిల్ దేశానికి వెళ్లి అక్కడి వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలను సందర్శించి అవి ఈ ప్రాంత ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని పరిశీలించడం జరిగింది....
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒంగోలు గిత్త అంతరించిపోకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు బ్రెజిల్ దేశ వ్యవసాయ శాఖ ప్రతినిధులను ఆయన ఆహ్వానించడం జరిగింది....
ఆ మేరకు 2019లో వారు ఒంగోలు వచ్చి వైవీ సుబ్బారెడ్డిని కలిశారు...
ఆ ఫోటోలను ఈరోజునుండి తెలుగుదేశం పార్టీ సర్క్యులేట్ చేస్తూ ఇందుకేనా ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ కోఆర్డినేటర్ గా తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని నియమించింది అంటూ అసత్య కథనాలు సోషల్ మీడియా వేదికగా వండివారుస్తున్నారు టిడిపి వారు....
ఉత్తరాంధ్ర డ్రగ్స్ ప్రతినిధిగా వైవి సుబ్బారెడ్డిని నియమించి తద్వారా అక్రమ సంపాదన పోగు వేసుకునేందుకు సీఎం జగన్ ప్లాన్ వేశారని కథనం రాశారు...
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న రీతిలో తెలుగుదేశం పార్టీ విధానం ఉందనేది స్పష్టమవుతుంది..
ఇలాంటి అసత్య కథనాల వల్ల టిడిపి ప్రతిష్ట ప్రజలలో మరింత పలచన అవుతుంది అని రాజకీయ మేధావుల అభిప్రాయం..
అంతేకాదు గుమ్మడికాయల దొంగ భుజాన్ని తముడుకున్నట్లుగా వీరు చేసే దుష్ప్రచారం ఉందని ఇది టిడిపికే ప్రమాదకరమనేది రాజకీయ విశ్లేషకులు అంచనా...
తాము ప్రజలకి ఏమి చేస్తామనేది చెప్పుకోలేక మరోవైపు కూటమిలో గందరగోళ పరిస్థితులు సరిదిద్దుకోలేక టికెట్ల కేటాయింపుల్లో వస్తున్న అసమ్మతిని సర్దుబాటు చేయలేక ఆ కసిని వైసీపీ మీద ప్రయోగించి వారిని బదనాం చేయాలనుకుంటే అసలుకే మోసం టిడిపికే వస్తుంది అనేది పలువురి అంచనా....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0