పల్నాడు తిరుపతి ఘటనలపై తీవ్రంగా స్పందిస్తూ పలువురు అధికారులను సస్పెండ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
పల్నాడు తిరుపతి ఘటనలపై తీవ్రంగా స్పందిస్తూ పలువురు అధికారులను సస్పెండ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
13న ఎన్నికలు జరిగినా అనంతరం పల్నాడు జిల్లాలో గురజాల.. మాచర్ల..నరసరావుపేటలో జరిగిన హింసాత్మక సంఘటనలపై కొరడా ఝలిపించింది..
అనంతపురం జిల్లా తాడిపత్రి... తిరుపతి లో జరిగిన సంఘటనలపై కూడా తీవ్రంగా స్పందించింది కేంద్ర ఎన్నికల సంఘం...
ఎన్నికలు జరిగినా రెండు రోజులకు కూడా అల్లర్లను అరికట్టడంలో పోలీస్ అధికారుల వైఫల్యం పై తీవ్రంగా స్పందించింది..
ఈరోజు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి... రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి నివేదిక సమర్పించిన అనంతరం ఘటన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది..
పల్నాడు ఎస్పి, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేస్తూ శాఖపరమైన విచారణకు ఆదేశించింది..
అదే విధంగా పల్నాడు కలెక్టర్ తిరుపతి కలెక్టర్లను బదిలీ చేస్తూ శాఖా పరమైన విచారణకు ఆదేశించింది..
వీరు కాక ఎస్పీకి దిగువ స్థాయి ర్యాంకు అయినటువంటి డి.ఎస్.పి...సీఐ...ఎస్ఐ వంటి పన్నెండు మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది...
ఇక ఈ అంశంపై పేర్ని నాని... బొత్స సత్యనారాయణ తదితర వైసిపి కీలక నేతలు గవర్నర్ కూడా వినతిపత్రం ఈరోజు సాయంత్రం అందించారు..
ప్రశాంతంగా ఉండాల్సిన ఎన్నికల వాతావరణాన్ని ఎన్డీఏ కూటమి తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అధికారులను మార్పించి కుట్రలకు తెరలేపిందని వారు ఆరోపించారు...
గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా కనివిని ఎరుగని రీతిలో హింసాత్మక సంఘటనలు జరిగాయని వారు ఆరోపించారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0