వైసీపీకి అన్ని మంచి శకునములే...
వైసీపీకి అన్ని మంచి శకునములే...
వైసీపీకి రానున్న ఎన్నికల్లో మరల విజయకేతనం ఎగురవేసేందుకు అన్ని మంచి శకునములే ఎదురవుతున్నాయి అని చెప్పక తప్పదు...
ప్రముఖ టీవీ చానల్స్ టీవీ9.. ఎన్ టీవీ లలో జరిగే డిబేట్లను టిడిపి వారు బహిష్కరించారు..
గతంలోనే సాక్షి టీవీని బహిష్కరించడం జరిగింది.. అయితే తాజాగా టీవీ చానల్స్ కి ఇచ్చే రేటింగ్స్ లో టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీ మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ టీవీ చానల్స్ ను వీక్షిస్తున్నట్లు తాజా రేటింగ్స్ తెలియజేస్తున్నాయి..
ఇది ఒక మంచి పరిణామానికి సంకేతంగా.. ప్రజలలో వైసిపిపై ఉన్నటువంటి అభిమానం కి తార్కాణంగా రాజకీయ ఉద్దండులు.. పరిశీలకులు భావిస్తున్నారు...
అంతేకాకుండా అంతర్గతంగా టిడిపి సమీక్షలలో 147 స్థానాలలో వైసీపీ ముందంజలో ఉన్నట్లు వెలువడిన వీడియో ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తుంది...
ఈ అంశంపై టిడిపి కూడా నోరు మెదపడం లేదు..
ఆ 147 స్థానాలు లిస్ట్ కూడా బయట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది...
ఈ లిస్టులో ఉన్నటువంటి నియోజకవర్గాల పేర్లు గమనిస్తే ఆది నుండి టీడీపీ కంచుకోటగా ఉన్న విశాఖపట్నం ఉత్తరం, దక్షిణం, పశ్చిమ నియోజకవర్గంలు..ప్రకాశం జిల్లాలో టిడిపికి పట్టుగొమ్మలైన కొండేపి అద్దంకి పర్చూరు నియోజకవర్గాలు లలో సైతం వైసిపి ఆదిక్యం ఉందని తెలియజేస్తున్నాయి...
సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్తవారిని కేటాయించిన . పేడన మంగళగిరి గోపాలపురం పి గన్నవరం మచిలీపట్నం వంటి నియోజకవర్గాలలో కూడా ఫ్యాన్ గాలే వేస్తుందని సదరు సర్వే తెలియజేస్తుంది..
నెల్లూరు సిటీ..నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో కూడా వైసిపి ముందంజలో ఉందనేది ఈ సర్వే సమాచారం...
ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలు తర్వాత ప్రస్తుతం జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ల తరువాత వైసిపి గ్రాఫ్ మరింత పెరిగింది అనేది అంచనా..
సిద్ధం కాన్సెప్ట్ ద్వారా వైసీపీ క్యాడర్ లో నూతన ఉత్తేజం రావడంతో పాటు దాదాపు 4.5 ఏళ్ల తర్వాత తమకు సంక్షేమ పథకాల అందిస్తూ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చర్చలు తీసుకుంటున్న సీఎం జగన్ ప్రజలలోకి నేరుగా రావడంతో అనూహ్యంగా జగన్ కి అపూర్వ ఆదరణ లభించడం.. ఆయనపై క్షేత్రస్థాయిలో ఉన్న ఆదరాభిమానాలను ఉవెత్తున తరలివచ్చి ప్రజలు వ్యక్తపరుస్తున్నారు..
ప్రాథమిక అవసరాలైన విద్య వైద్యం పట్ల జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు..విప్లవాత్మక మార్పులు.. సచివాలయ వ్యవస్థ.. వాలంటీర్లు అంశాలు అన్నీ కూడా ప్రజలలో మంచి అభిప్రాయం జగన్ ప్రభుత్వం మీద కలిగించాయి అని చెప్పక తప్పదు..
అబద్ధాలు నిత్యం వండి వార్చే తెలుగుదేశం పార్టీ మద్దతు దారులైన ఎలక్ట్రానిక్ మీడియా.. ప్రింట్ మీడియా..సోషల్ మీడియా ప్రభావాన్ని తోసి రాజని జగన్ మీద ఉన్నటువంటి అచంచల విశ్వాసం రోడ్ షోలకు.. మేమంతా సిద్ధం సభలకు వస్తున్న జనాదరణ తెలియజేస్తుంది..
ఇది చావు బతుకుల సమస్య ప్రతి ఎన్నారై వైసీపీకి ఓటు పడుతుంది అనుకుంటే ఎంతైనా డబ్బులు ఇచ్చి ఓటు కొనుగోలు చేయాలి అని తెలుగుదేశం ఎన్నారై వింగ్ సంభాషణ లకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0