వెలుగొండ సభలో విరిసిన నవ్వులు పువ్వులు
వెలుగొండ సభలో విరిసిన నవ్వులు పువ్వులు
మార్కాపురం రెవిన్యూ డివిజన్ కలల స్వప్నమైన వెలుగొండ రెండవ సొరంగం ప్రారంభం అనంతరం జరిగిన సభలో కాసేపు నవ్వులు వెల్లివిరిసాయి...
ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల పరిచయం ప్రారంభించారు...
ఎర్రగొండపాలెం అభ్యర్థి చంద్రశేఖర్ ను పరిచయం చేస్తూ చంద్ర ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు..
రా అన్న రాంబాబు అన్న... అంటూ అన్నా రాంబాబును మార్కాపురం అభ్యర్థిగా... మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి రాంబాబు అంటూ పరిచయం చేసే సందర్భంలో వేదిక మీద ఉన్న అందరూ అభ్యర్థులు పరిచయం తమని కూడా చేయమంటూ వచ్చారు...
ముసి ముసి నవ్వులు నవ్వుతూ మంత్రి ఆదిమూలం సురేష్ ని ఉద్దేశించి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు నిన్ను పరిచయం చేస్తాను అంటున్నప్పటికీ ఆ ప్రాంతవాసి అయినా సురేష్ తనను కూడా పరిచయం చేయాలని కోరడంతో మీ సురేష్ అని పరిచయం చేస్తూ...
కనిగిరి అభ్యర్థి నారాయణ వైపు చూసి రా నారాయణ రా అంటూ నారాయణను గూడ నవ్వుతూ పరిచయం చేశారు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైపు చూపిస్తూ అదిగో మీ మంత్రి...కాబోయే జిల్లా మంత్రి అని పరిచయం చేయడంతో సభలో కేరింతలు మోగాయి..
బాలినేని కూడా సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు..
ఇక గిద్దలూరు సంతనూతలపాడు అభ్యర్థులు కూడా ముందుకు రావడంతో వారిని సీఎం పరిచయం చేస్తూ ముగించారు...
ఆద్యంతం ఆసక్తికరంగా ఈ పరిచయ కార్యక్రమం జరిగింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0