విద్యుత్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి
విద్యుత్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి
తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు....
రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్ ను అందించేందుకు విద్యుత్ సరఫరా డిమాండులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని స్పష్టం చేశారు...
దేశంలో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడని ఆయన తీసుకు వచ్చినన్ని విద్యుత్ సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదని అన్నారు....
దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు....
విద్యుత్ శాఖ అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందించే విధంగా పనిచేయాలని మంత్రి రవికుమార్ ఆకాంక్షించారు.
గత ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్వీర్యం చేయడమే గాక 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి అవసరాన్నిబట్టి విద్యుత్తు చార్జీల పెంపుదలపై నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి,బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్,బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్ర వర్మ,పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్,పలువురు ఇతర ప్రజాప్రతినిధులు,ఇంధనశాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0