ఊహించిన విధంగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా
ఊహించిన విధంగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా
భావోద్వేగం మధ్య ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఒంగోలులో విలేకరుల సమావేశంలో ప్రకటించారు...
1991లో తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికల కావడంతో మాగుంట కుటుంబం రాజకీయ ప్రస్థానం ఒంగోలు తో అల్లుకుపోయిందని తెలిపారు...
ఒంగోలు తో ఉన్నటువంటి రాజకీయ సంబంధం తెంచుకోలేనిదని స్పష్టం చేశారు... మాగుంట కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చిందని మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు నుండి ఎంపీగా బరిలో ఉండబోతున్నారని ప్రకటించారు...
ఈ ఐదేళ్ల పదవీకాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో సహకరించారు అని...వైసిపి క్యాడర్ మమ్మల్ని ఎంతో అభిమానించిందని తెలిపారు... అయితే ఆత్మగౌరవం కలిగినటువంటి కుటుంబంగా బాధాకర పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు..
భవిష్యత్తులో కూడా తమ కుటుంబానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఆయన కోరారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0