మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలోకి రానున్నారా
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలోకి రానున్నారా
మంగళగిరి ఇన్చార్జిగా గంజి చిరంజీవిని నియమించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటిలోకి చేరనున్నట్లు సమాచారం...
2019 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగుల్లోనే మంగళగిరిలో ఆర్కే ని గెలిపిస్తే మంత్రి పదవిని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు...
అదేవిధంగా ఆర్కే మంగళగిరి బరిలో ఈ ఎన్నికలకు మాత్రమే ఉంటానని 2024 ఎన్నికలలో బీసీకి కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు..
అయితే సామాజిక సమీకరణాల కారణంగా ఆర్కే కు మంత్రి పదవి దక్కలేదు... రెండవసారి కూడా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆరోజు నుండి ఆయన పార్టీ కార్యకలాపాలలో సబ్జుగా ఉండటంతో పాటు ఎమ్మెల్యేగా చురుకుగా కార్యక్రమాలలో కూడా పాల్గొనలేదు....
మంగళగిరి టికెట్ బీసీ కి కేటాయించాలనే ఆలోచనతో ఇన్చార్జిగా గంజి చిరంజీవిని నియమించడంతో ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల ప్రకటించి షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు...
షర్మిల తో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు... అయితే ఏదో విపరీతంగా ఊహించుకొని అనూహ్య స్పందన షర్మిల కు వస్తుందని ఆలోచన ఆర్కే కు ఉండి ఉండొచ్చు...
అయితే కళ్ళారా వాస్తవ పరిస్థితులను గమనించిన తర్వాత మరల మనసు మార్చుకొని ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు..
మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న విజయసాయిరెడ్డిని ఆయన కలిసినట్లు వార్తలు వస్తున్నాయి...
తన అన్న అయోధ్య రామిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు నమ్మినబంటుగా ఉన్నారు...ఈ నేపథ్యంలో వైసీపీలో కొనసాగాడమే ఉత్తమమనే నిర్ణయానికి ఆళ్ల వచ్చి ఉండొచ్చు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0