పెందుర్తి జనసేనకు కేటాయించడం కు తీవ్ర అసంతృప్తితో బండారు
పెందుర్తి జనసేనకు కేటాయించడం కు తీవ్ర అసంతృప్తితో బండారు
175 అసెంబ్లీ నియోజకవర్గాల 24 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం జగన్ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అనేది నిర్ధారించలేదు...
వైసీపీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు సుముఖంగా ఉంటే అతనికి ఆ సీటు కేటాయించేందుకు వైసిపి అధిష్టానం రెడీగా ఉంది అనేది ఒక సమాచారం..
అదేవిధంగా నిన్నటి నుండి బండారు సత్యనారాయణ పేరు ఎవరైతే రోజాపై అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడి సంచలనాన్ని సృష్టించారో ఆయన పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది...
పెందుర్తి స్తావరంగా తను రాజకీయం చేస్తుండగా పెందుర్తి సీటును జనసేనకు టిడిపి కేటాయించింది.. ఈ పరిస్థితులపై తీవ్ర అసహనంగా బండారు ఉన్నట్లు సమాచారం..
టిడిపి గెలిచే సీటును తీసుకువెళ్లి అప్పనంగా జనసేనకు కేటాయించటం ఓటమిని కొనితెచ్చుకోవడమేనని బండారు వర్గీయులు బాధపడుతున్నారు..
అయితే పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బండారు కుటుంబీకులకి ఇప్పటికే మూడు టికెట్లు ఇచ్చి ఉన్నామని తెలుగుదేశం చెబుతుంది..
అయితే ఈ వాదనకు బండారు సత్యనారాయణ సుతరము అంగీకరించటం లేదు..
తన అల్లుడు రామ్మోహన్ నాయుడు.. బంధువు అచ్చం నాయుడు.. రాజమండ్రి నుండి ఆదిరెడ్డి కుటుంబానికి టికెట్లు కేసమాచారం...వారు తమ కుటుంబాలుగా చెప్పడం ఏమాత్రం సమంజసంగా లేదని...వారితో బంధుత్వం కలవకముందే తాను టిడిపిలో ఉన్నానని బండారు వాదిస్తున్నారు..
ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం పార్లమెంట్ అభ్యర్థిగా ఇస్తే వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు బండారు సత్యనారాయణ సమాచారం పంపినట్లు తెలిసింది... ఆ ప్రతిపాదనకు వైసిపి వారు కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం...
అదే విధంగా అనకాపల్లి.. విశాఖ సౌత్.. ఎలమంచిలి.. మాడుగుల నియోజకవర్గాలలో కూడా టికెట్ల దక్కని టిడిపి అభ్యర్థులు తీవ్ర అసమ్మతి అసంతృప్తులతో ఉన్నట్లు సమాచారం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0